AP : గోదావరి ఉగ్రరూపం: పోలవరం నుండి నీటి విడుదల, పాపికొండలు యాత్ర రద్దు

Godavari Swells: Polavaram Discharges Water, Papikondalu Tour Suspended

 

AP : గోదావరి ఉగ్రరూపం: పోలవరం నుండి నీటి విడుదల, పాపికొండలు యాత్ర రద్దు:గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎగువ ప్రాంతాలు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉపనదులు, వాగులు ఉప్పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.

పోలవరం ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల

గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎగువ ప్రాంతాలు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉపనదులు, వాగులు ఉప్పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో, పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుండి 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జలవనరుల శాఖ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. గోదావరిలో వరద ప్రవాహం పెరిగిన కారణంగా అల్లూరి జిల్లాలోని దేవీపట్నం నుండి పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. దేవీపట్నం మండలం దండంగి, డి. రావిలంక గ్రామాల మధ్య ఉన్న ఆర్ అండ్ బీ రహదారిపై గోదావరి వరద నీరు చేరడంతో, గండి పోచమ్మ ఆలయం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read also:AIR: బ్యాక్ బెంచర్ల నుండి ఆల్ ఇండియా ర్యాంకర్స్ వరకు

Related posts

Leave a Comment