KaushikReddy : రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు: శివసేనా రెడ్డి తీవ్ర హెచ్చరిక:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డికి మతి భ్రమించిందని, ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని శివసేనా రెడ్డి విమర్శించారు.
రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు: శివసేనా రెడ్డి తీవ్ర ఖండన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డికి మతి భ్రమించిందని, ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని శివసేనా రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తోందని శివసేనా రెడ్డి పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే, సన్నబియ్యం తినే ప్రజలే ఆయనను కొడతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉచిత బస్సు ఎక్కే మహిళలు ఊరుకోరని ఆయన స్పష్టం చేశారు.
ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు చేయడం సరికాదని శివసేనా రెడ్డి అన్నారు. వారి ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పాపం కేటీఆర్‌దేనని ఆయన ఆరోపించారు. మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసని శివసేనా రెడ్డి పేర్కొన్నారు.
Read also:MuraliMohan : అతడు రీ-రిలీజ్: మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
