Kavitha : కవిత సంచలన ఆరోపణలు: ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ రేవంత్ రెడ్డిపై విమర్శలు:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఆయన ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఇప్పటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
బీసీ రిజర్వేషన్లపై కవిత ప్రెస్ మీట్: రేవంత్ ఢిల్లీ పర్యటనలు, బీజేపీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఆయన ఈరోజు కూడా ఢిల్లీకి వెళ్తున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఇప్పటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పటికీ, బీసీ రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించే ప్రయత్నం చేయలేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి గట్టిగా వాదించాలని ఆమె సూచించారు.
హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని, అయితే బీసీలు పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను కోరుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు. రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బీసీ వర్గాల ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు జాతీయ పార్టీలు మోసం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్న తీరు బాధాకరమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి గతంలోనే పంపించినప్పటికీ, అది రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉందని, తిరిగి పంపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ బిల్లుకు మతపరమైన రంగు పులిమి బీజేపీ ఆమోదించడం లేదని కవిత విమర్శించారు. గుజరాత్లో ఎలాంటి రిజర్వేషన్లు ఇచ్చారో అందరికీ తెలుసని, కానీ తెలంగాణ విషయంలో మాత్రం బీజేపీ వేరే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ 50 శాతానికి పైగా రిజర్వేషన్లను అమలు చేస్తోందని కవిత పేర్కొన్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి న్యాయస్థానాల పరిధిలో ఉందని సాకులు చెబుతోందని విమర్శించారు. బీసీ వర్గాలను రిజర్వేషన్లకు దూరం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.
Read also:Hyderabad Rains :మంగళవారం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పాటించాలని సైబరాబాద్ పోలీసుల విజ్ఞప్తి
