Matrimony : మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో రూ.22 లక్షలు కాజేసిన కిలాడీ లేడీ

Matrimony Site

Matrimony : మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో రూ.22 లక్షలు కాజేసిన కిలాడీ లేడీ:హైదరాబాద్‌, తెలంగాణ: మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను బురిడీ కొట్టించిన కిలాడీ లేడీ, అతని నుంచి దశలవారీగా రూ. 22 లక్షలు కాజేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో జరిగింది.

మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌

హైదరాబాద్‌, తెలంగాణ: మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను బురిడీ కొట్టించిన కిలాడీ లేడీ, అతని నుంచి దశలవారీగా రూ. 22 లక్షలు కాజేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో జరిగింది. బహదూర్‌పురాకు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాట్రిమోనీ సైట్‌లో వధువు కావాలంటూ ప్రకటన ఇచ్చారు.

దీనికి స్పందించిన ఓ మహిళ, తాను పాకిస్థాన్‌కు చెందిన నటినని, తన పేరు పర్వరిష్ షా అని పరిచయం చేసుకుంది. వ్యాపారవేత్తతో తన వాట్సాప్ నంబర్‌ను పంచుకున్న ఆమె, తన డీపీలో పాకిస్తాన్ నటి పర్వరిష్ షా ఫోటోను ఉంచింది. అంతేకాకుండా, వ్యాపారవేత్తను నమ్మించేందుకు నటి పర్వరిష్ షా నటించిన సీరియల్స్, సినిమా వీడియోలు, ఫోటోలు కూడా షేర్ చేసింది.

తాను పాకిస్తాన్ నటిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ వ్యాపారి ఊహల్లో తేలియాడాడు. ఈ విషయాన్ని తన స్నేహితులు, బంధువులతోనూ పంచుకున్నాడు. ఇదే క్రమంలో, అనిషా ఎం హుండేకర్ అనే మహిళ, సదరు మహిళకు సోదరినని పరిచయం చేసుకుని ఈ వ్యాపారితో స్నేహం పెంచుకుంది. ఇద్దరూ కలిసి వ్యాపారవేత్తను మాయమాటలతో బురిడీ కొట్టించారు.

కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉందని, రోడ్డు ప్రమాదాలు జరిగాయంటూ దశలవారీగా అతని దగ్గర నుంచి రూ. 22 లక్షలు వసూలు చేశారు. అయితే, ఆ మహిళ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో వ్యాపారవేత్తకు అనుమానం వచ్చింది. ఈ ఘటనపై వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కిలాడీ లేడీ అసలు పేరు ఫాతిమా అని తేలింది. ఫోన్ నంబర్ ఆధారంగా నిందితురాలిని పట్టుకుని కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read also:US : ఇరాన్ ఉద్రిక్తతల నడుమ అమెరికాలో ఉగ్రదాడుల భయం

Related posts

Leave a Comment