TeenmarMallanna : కాంగ్రెస్-కవిత బంధంపై తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు

Teenmar Mallanna Calls for BC Unity, Accuses Kavitha of Attempted Murder

TeenmarMallanna : కాంగ్రెస్-కవిత బంధంపై తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు:కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్య అనధికారిక ఒప్పందం నడుస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు, కవితకు మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం వచ్చిందని మల్లన్న పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవిత – కాంగ్రెస్ అనధికారిక ఒప్పందం: తీన్మార్ మల్లన్న ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్య అనధికారిక ఒప్పందం నడుస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు, కవితకు మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం వచ్చిందని మల్లన్న పేర్కొన్నారు. ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అగ్రకులాల వారంతా ఏకమై బీసీలపై దాడి చేయాలని చూస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలందరూ ఏకమై రాజకీయ పార్టీగా ఏర్పడి, రాష్ట్రంలో అధికారాన్ని చేపడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలంతా ఒకవైపు, కల్వకుంట్ల కుటుంబం మరోవైపు అని ఆయన అన్నారు. తనపై వారి మనుషులను ఉసిగొలిపి కవిత హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. తనపై, తన కార్యాలయంపై దాడి చేసిన సుజిత్ రావు కవిత బంధువేనని మల్లన్న వెల్లడించారు.

తనపై జరిగిన దాడిని బీఆర్ఎస్ నాయకులు కూడా స్వాగతించలేదని మల్లన్న అన్నారు. అయితే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి కవితకు మద్దతుగా మాట్లాడారని ఆయన విమర్శించారు. మరోవైపు, తీన్మార్ మల్లన్నకు ‘వై ప్లస్ కేటగిరీ’ భద్రతను కల్పించాలని మున్నూరు కాపు సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు ఐక్య వేదిక నేతలు తెలిపారు.

Read also:NRI : యూరప్‌లో జీవితం అంత సులువు కాదా? ఒక ఎన్ఆర్ఐ గోడు!

Related posts

Leave a Comment