RevanthReddy : పరువు నష్టం కేసులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తన తుది తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
పరువు నష్టం కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన హైకోర్టు తీర్పు రిజర్వ్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తన తుది తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై బీజేపీ నేత వాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కింది కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం, వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Read also:GoldenVisa : భారతీయ నివాసితులకు యూఏఈ గోల్డెన్ వీసా: రూ. 23.30 లక్షలతో జీవితకాల చెల్లుబాటు
