NaraLokesh : కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభం – మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం:మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదని, అది వారి స్వేచ్ఛకు, గౌరవానికి, ప్రభుత్వంపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ ఉచిత బస్సు టికెట్ మహిళల సాధికారతకు ప్రతీక.
కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభం – మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదని, అది వారి స్వేచ్ఛకు, గౌరవానికి, ప్రభుత్వంపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ ఉచిత బస్సు టికెట్ మహిళల సాధికారతకు ప్రతీక. ఇది కేవలం ప్రయాణం కాదు, సమాన అవకాశాల దిశగా వేస్తున్న ఒక ముందడుగు.
స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళా సాధికారతకు మా ప్రభుత్వం పట్టం కట్టింది” అని లోకేశ్ తెలిపారు.ఈ చారిత్రక సందర్భాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలని ఆయన రాష్ట్రంలోని మహిళలకు పిలుపునిచ్చారు. ప్రయాణ సమయంలో తమ ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ దిగి, మహిళా సాధికారత అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలని ఆయన కోరారు.
