AP : ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు: ప్రభుత్వం అప్రమత్తం:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు: ప్రభుత్వం అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు
- రానున్న ఐదు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు.
- కృష్ణా, గోదావరి నదుల తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలి. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలి.
- ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలి.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు
- భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలి.
- ఎక్కడైనా కరెంట్ స్తంభాలు దెబ్బతింటే తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి.
- వర్ష ప్రభావిత జిల్లాల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తనకు నివేదికలు పంపాలి.
- ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అందుబాటులో ఉండాలి.
ప్రజల రక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉందని మంత్రులు భరోసా ఇచ్చారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేసి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Read also:Health News : కీళ్లవాతం చికిత్సలో కొత్త ఆశ: జపాన్ పరిశోధకులు గుర్తించిన ‘రహస్య రోగనిరోధక కేంద్రాలు’
