AnilAmbani : అనిల్ అంబానీకి ఈడీ షాక్: రూ. 17 వేల కోట్ల కేసులో సమన్లు:ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి పెద్ద షాకిచ్చింది. రూ.17,000 కోట్ల రుణాల మోసం కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి పెద్ద షాకిచ్చింది. రూ.17,000 కోట్ల రుణాల మోసం కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ కోసం ఈ నెల 5న హాజరు కావాలని ఆదేశించింది.
గతంలో, జులై 24న, అనిల్ అంబానీకి చెందిన దాదాపు 50 కంపెనీలు, 25 మంది వ్యాపార భాగస్వాముల ఇళ్లు, అలాగే అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించిన 35 కార్యాలయాలపై ఈడీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద మూడు రోజులపాటు జరిగిన ఈ తనిఖీల్లో ఈడీ అధికారులు ముఖ్యమైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Read also:Andhra Pradesh : కోనసీమలో క్షుద్రపూజల కలకలం: నలుగురు వ్యక్తులు అరెస్ట్
