Telangana : సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ వ్యాఖ్యలు.. కౌంటరిచ్చిన కోమటిరెడ్డి:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు.సోషల్ మీడియా జర్నలిస్టులను గౌరవించాలని, వారిని అవమానించడం తగదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
రేవంత్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శల దాడి: సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు.సోషల్ మీడియా జర్నలిస్టులను గౌరవించాలని, వారిని అవమానించడం తగదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. సామాజిక బాధ్యతతో పనిచేసే వారిని అందరూ గౌరవించాలని ఆయన సూచించారు. సమాజం కోసం నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోషల్ మీడియా మొదటి నుంచి కృషి చేస్తోందని, పాలకులు దానిని గౌరవించాలే తప్ప అవమానించకూడదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇటువంటి కుట్రలను తెలంగాణ సమాజం సహించదని ఆయన హెచ్చరించారు.కొంతకాలం క్రితం ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా జర్నలిస్టులపై మండిపడ్డారు.
సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వచ్చే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వారిని ప్రధాన మీడియా జర్నలిస్టుల నుంచి వేరు చేసి చూడాలని సూచించారు. “రోడ్ల మీద తిరిగేవాడు, ఎక్కువ తిట్లు వచ్చినోడు జర్నలిజం ముసుగు తొడుక్కుని అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారని” ఆయన విమర్శించారు.
