- వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
- తదుపరి దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ
- కోర్టు ఆదేశిస్తే ముందుకెళతామని స్పష్టం చేసిన దర్యాప్తు సంస్థ
- దర్యాప్తు కొనసాగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు
- కేసులో తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పిటిషనర్లు కోరినట్లుగా విచారణను ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేనప్పటికీ, దానిపై కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందని సీబీఐ పేర్కొంది.
మంగళవారం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దర్యాప్తు కొనసాగించాలని కోరారు. దీనిపై స్పందించిన సీబీఐ, కోర్టు ఆదేశాలు వస్తే తాము పూర్తిస్థాయిలో విచారణ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది.
2019లో జరిగిన ఈ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో జాప్యం జరుగుతోందని, పూర్తి న్యాయం జరగలేదని పిటిషనర్లు ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇప్పుడంతా సుప్రీంకోర్టు తీర్పుపైనే దృష్టి కేంద్రీకృతమైంది. దర్యాప్తు కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కోర్టు తీర్పు వెలువడితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చకు దారితీయనుంది.
Read : YS Viveka Case Another Witness Passed Away | ఈ కేసు తెలుతుందా ..| సునీతా రెడ్డి హై కోర్టు లో పిటిషన్
