Andhra Pradesh:లక్ష కోట్ల పనులకు మోడీ శంకుస్థాపనలు

Modi foundation stone for projects worth Rs 1 lakh crore

Andhra Pradesh:ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారని ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ తెలిపింది. మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లతో పాటు జన సమీకరణ, ట్రాఫిక్ కంట్రోల్, ప్రజలకు కల్పించాల్సిన ఇతర ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉప సంఘంలో చర్చించారు.

లక్ష కోట్ల పనులకు మోడీ శంకుస్థాపనలు

అమరావతి, ఏప్రిల్ 22
ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారని ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ తెలిపింది. మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లతో పాటు జన సమీకరణ, ట్రాఫిక్ కంట్రోల్, ప్రజలకు కల్పించాల్సిన ఇతర ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉప సంఘంలో చర్చించారు.ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు వేర్వేరుగా బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని పాల్గొనే అన్ని కార్యక్రమాల గురించి చర్చించామన్నారు. ప్రధాని మోదీ అమరావతిలో లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారని, ఆ తర్వాత పనులు శరవేగంగా జరుగుతాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.”ప్రధాని మోదీ వచ్చే నెల 2న మధ్యాహ్నం 3 గంటలకు అమరావతికి వస్తారు.

సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. జన సమీకరణపై చర్చ జరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ పై సీఆర్డీఏ, నేషనల్ హైవేస్ తో చర్చ జరిగింది. అధికారులకు వర్క్ ఎలాట్ మెంట్ జరిగింది. 5లక్షల మంది జనం వస్తారని అంచనా” అని మంత్రి నారాయణ తెలిపారు.కోసం రైతులు భూమి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలిపే వేదికగా మోదీ సభ ఉంటుంది. వివిధ నియోజకవర్గాల నుంచి నేతలు, క్యాడర్ సామాన్య జనం హాజరవుతారు” అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.”లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కు ప్రధాని ప్రారంభోత్సవం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ కీలక ప్రాజెక్ట్ లో అమరావతి ఒకటి. రేపటి ప్రధాని టూర్ లో అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలి. అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధులు వస్తారు” అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

Read more:Andhra Pradesh:ఎవ్వరికి పట్టని పెనుకొండ చారిత్రాత్మక ప్రాంతాలు

Related posts

Leave a Comment