సంక్షిప్త వార్తలు:04-27-2025:భాగ్యనగరంలో భారత్ సమ్మిట్ 2025 నోవాటెల్ న్యాయ్ పత్ ఎగ్జిబిషన్ ను) తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ. విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ. సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్.
న్యాయ్ పత్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్
భాగ్యనగరంలో భారత్ సమ్మిట్ 2025 నోవాటెల్ న్యాయ్ పత్ ఎగ్జిబిషన్ ను) తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ. విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ. సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ పార్టీ ఐసిసి కార్యదర్శలు. విశ్వనాథ్. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి. తెలంగాణ రాష్ట్రం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్. తెలంగాణ రాష్ట్ర గడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు. తదితర శాసన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మూగ జీవాలకు నీటి సదుపాయం
ఒంగోలు
ఒంగోలు నగరంలో మూగ జీవాలకు, పక్షులకు త్రాగు నీటి సదుపాయం కల్పించడంలో భాగంగా ఒంగోలు మునిసిపల్ కార్పోరేషన్ నీటి తొట్టెలను ఏర్పాటు చేసింది.వీటిని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రారంభించారు.వేసవిలో పక్షులు త్రాగునీటి ఎద్దడి పడకుండా ఉండేలా ప్రతీ ఒక్కరూ భాద్యతతో ముందుకు రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, మునిసిపల్ కమీషనర్ శ్రీ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
క్యారమ్స్ ఆడిన మంత్రి మండిపల్లి
అనంతపురం
అనంతపురం మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యారంస్ ఆడారు.మడకశిరలో పర్యటించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించా రు. అనంతరం ఎమ్మెల్యే తో పాటు స్థానిక టిడిపి నాయకులతో కలిసి సరదాగా ఇండోర్ గేమ్స్ ఆడారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో ఇతర టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
