సంక్షిప్త వార్తలు:05-06-2025:ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంతో హైడ్రాపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. దశాబ్దాల సమస్యలకు రోజుల్లో హైడ్రా పరిష్కారం చూపడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, చెరువులు, నాలాల కబ్జాలను చూసి తమకెందుకులే అనుకోకుండా.. హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. రహదారిపై ఉన్న ఆటంకాలను వదిలేసి.. చుట్టు తిరిగి వెళ్లే వారు.. ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి రాజమార్గంలో ప్రయాణించాలని చూస్తున్నారు.
హైడ్రాకు స్వచ్ఛందంగా ఫిర్యాదులు
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ముందుకు వస్తున్న ప్రజలు
హైదరాబాద్
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంతో హైడ్రాపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. దశాబ్దాల సమస్యలకు రోజుల్లో హైడ్రా పరిష్కారం చూపడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, చెరువులు, నాలాల కబ్జాలను చూసి తమకెందుకులే అనుకోకుండా.. హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. రహదారిపై ఉన్న ఆటంకాలను వదిలేసి.. చుట్టు తిరిగి వెళ్లే వారు.. ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి రాజమార్గంలో ప్రయాణించాలని చూస్తున్నారు.
సోమవారం హైడ్రా ప్రజావాణి ఫిర్యాదుల్లో బాధితుల కంటే సామాజిక కోణంలో ఆలోచించేవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తం 54 ఫిర్యాదులు ప్రజావాణికి వచ్చాయి. ఫిర్యాదులను హైడ్రా ఫైర్ విభాగం అదనపు సంచాలకులు శ్రీ వర్ల. పాపయ్య గారు పరిశీలించారు. ఫిర్యాదు వెనుక ఉద్దేశాలను అడిగి తెలుసుకున్నారు. గూగుల్ మ్యాప్స్, సాటిలైట్ ఇమేజీలతో ఫిర్యాదులను పరిశీలించి తదుపరి చర్యలను సూచించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూ ప్రకంపనలు..
పరుగులు తీసిన ప్రజలు..

కరీంనగర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయి. సోమవారం సాయంత్రం జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. ధర్మపురి, సిరిసిల్ల, సుల్తానాబాద్లోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 3.5గా భూకంప తీవ్రత నమోదైంది. దాదాపు ఐదు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి సైతం కదిలిపోవడంతో ఏ జరుగుతుందో అర్థంకాక భయంతో బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలో ఇలా భూమి కంపించడం రెండోసారి కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. అలాగే నిర్మల్ జిల్లాలోనూ పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
సింహాచలం ఘటన..ఏడుగురిపై వేటు

విశాఖపట్నం
సింహాచలం ఆలయ గోడ కూలిన ఘటనలో ప్రభుత్వ చర్యలు ప్రారంభం అయ్యాయి. ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ముగ్గురు సభ్యులు కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టులో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టర్ సహ ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశం ఇచ్చింది. సింహాచలం ఆలయ ఈవో కే.సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈజూ కే.ఎస్.మూర్తి, ఏపీటీడీసీ డిప్యూటీ ఈఈ స్వామి, ఏపీటీడీసీ ఏఈ పి.మదన్, ఆలయం జేఈ కే.బాబ్జీపై సస్పెన్షన్ వేటు వేసింది.
