సంక్షిప్త వార్తలు:05-08-2025

police-station-jntu-kukatpally-hyderabad-police

సంక్షిప్త వార్తలు:05-08-2025:సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు వేసవిని దృష్టిలో పెట్టుకుని బాలానగర్ డివిజన్ లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు పోలీస్శాఖ, ఎన్జీవోల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా స్వచ్ఛవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని  అన్నారు.

కూకట్ పల్లి పోలీసు స్టేషన్ దగ్గర చలివేంద్రం

కూకట్ పల్లి
సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు వేసవిని దృష్టిలో పెట్టుకుని బాలానగర్ డివిజన్ లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు పోలీస్శాఖ, ఎన్జీవోల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా స్వచ్ఛవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని  అన్నారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని అని పోలీస్ స్టేషన్ ల దగ్గర స్వచ్ఛమైన నీటిని అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ రాజేష్, ఎస్సైలు, స్వచ్ఛవేద ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు..

మంత్రాలయంలో తప్పిన పెను ప్రమాదం

కూలిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్.

బెంగళూరు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు

మంత్రాలయం
మంత్రాలయంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూలిపోయింది. అదృష్టవశాత్తు జనం ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.   40 వేల లీటర్ల సామర్థ్యం తో ఓవర్ హెడ్ ట్యాంక్ ను నిర్మించారు.  ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.  ట్యాంక్ నాణ్యత ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

మాజీ ఎమ్మెల్యే భర్త, వైసీపీ నేత హత్య కేసు
పదకొండు మందికి యావజ్జీవ కారాగారశిక్ష

చెరుకులపాడు నారాయణ రెడ్డి న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, వీడియో & ఫోటోలు - Oneindia Telugu

కర్నూలు
వైసీపీ నేత పత్తికొండ మాజీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మొత్తం 16 మంది నిందితుల్లో 11 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది. ఐదుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో సుధీర్ఘ విచారణ అనంతరం.. గురువారం 11 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.

ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మద్దికుంట వెంకటరెడ్డి వాదనలు వినిపించారు.మరోవైపు కర్నూలు జిల్లా కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పట్ల దివంగత నారాయణరెడ్డి భార్య పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పందించారు. కోర్టు తీర్పుతో న్యాయస్థానాల పట్ల మరింత నమ్మకం పెరిగిందని చెప్పారు. కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుతోనైనా తనలాంటి మరో మహిళకు అన్యాయం జరగకూడదని భావిస్తున్నట్లు తెలిపారు..

ఆపరేషన్ సిందూర్ లో వంద మంది ఉగ్రవాదులు హతం
అఖిలపక్ష భేటీలోరక్షణ శాఖ మంత్రి  రాజ్నాథ్ సింగ్

Rajnath Singh Hails Army's Heroic Operation - NTV Telugu
న్యూఢిల్లీ
ఆపరేషన్ సిందూర్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసారు. అంతేకాకుండా, ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ పేరిట గట్టిగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్లోని ల్రైబరీ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీకి పలువురు నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ రాజకీయ పార్టీలకు వివరించారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. కేంద్రం తరఫున మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఆయనే ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు.

Related posts

Leave a Comment