Hyderabad :గోదావరిఖని మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశములు కల్పించుటకు తెలంగాణా రాష్ట్ర డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశానుసారం – సింగరేణి సి&ఏం.డి ఎన్. బలరాం ఐ ఆర్ ఎస్ సూచనల మేరకు రామగుండం ఏరియా1లో తేది.18.05.2025, ఆదివారం రోజున “మెగా జాబ్ మేళా” నిర్వహణ కొరకు అర్జి.
అర్జీ.1 ఏరియాలో “ మెగా జాబ్ మేళా”
గోదావరిఖని మరియు పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశములు కల్పించుటకు తెలంగాణా రాష్ట్ర డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశానుసారం – సింగరేణి సి&ఏం.డి ఎన్. బలరాం ఐ ఆర్ ఎస్ సూచనల మేరకు రామగుండం ఏరియా1లో తేది.18.05.2025, ఆదివారం రోజున “మెగా జాబ్ మేళా” నిర్వహణ కొరకు అర్జి.1 జియం శ్రీ లలిత్ కుమార్ గారి సారధ్యంలో అధికారుల బృందం కమ్యూనిటి హాలు మరియు జవహార్ లాల నెహ్రు స్టేడియం నందు స్థల పరిశీలన చేసి బస్టాండ్ కు మరియు మెయిన్ రోడ్ కు దగ్గర ఉన్నందున కమ్యూనిటీ హాల్ ను ఎంపిక చేయడం జరిగినది. ఈ మెగా జాబ్ మేళా తేదీ 18.05.2025 రోజున గోదావరిఖని కమ్యూనిటీ హాల్ నందు పెద్ద ఎత్తున నిర్వహించుటకు తగిన ఏర్పాట్లు చేయాలనీ ఇందులో 100 కంపెనీలు రానున్నాయని ఈ మెగా జాబ్ మేళాలో రామగుండం 1,2,3 ఏరియాలు మరియు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుండి సుమారు 10 వేల మంది నిరుద్యోగ యువతి యువకులు పాల్గొంటారని వారికి సరిపడు షామియానాలు, చల్లదనం కొరకు కూలర్స్, త్రాగు నీరు, హెల్ఫ్ డెస్క్ కౌంటర్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఇంటర్వ్యుల కొరకు ప్రత్యేక సేల్స్ వచ్చే కంపెనీల వారికి ప్రత్యేక వసతి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, అత్యున్నత అధికారులకు సరిపడు స్టేజి ఏర్పాట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయడంలో అధికారులు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, అన్ని గనుల సంక్షేమాధికారులు పెద్ద ఎత్తున ఉద్యోగుల పిల్లలు పాల్గొనేల చూడాలని తెలిపారు మరియు వివిధ డిపార్ట్ మెంట్ల ఉన్నతాధికారులు వారికి నిర్దేశించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారి చేసారు. ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్, డిజియం పర్సనల్ కిరణ్ బాబు, ఎన్విరాన్ మెంట్ డిజియం ఆంజనేయ ప్రసాద్, డిజీ.ఎం వర్క్ షాప్ జితేందర్ సింగ్, డిజియం వరప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, అధికారులు డెనిల్ కుమార్, వీరారెడ్డి, మరియు నాయకులు రంగు శ్రీనివాస్, పొలసాని శ్రీనివాస్, మహంకాళీ స్వామీ, దీటి బాలరాజు గట్ల రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read more:Andhra Pradesh : తెలంగాణ బాటలో ఆంధ్రా
