సంక్షిప్త వార్తలు : 14-05-2025:నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను అధికారులు కూల్చివేసారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేసారని వ్యాపారస్తులు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనలో వున్నారు.
చిరు వ్యాపారాల షాపులను తొలగించిన అధికారులు

నాగర్ కర్నూలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను అధికారులు కూల్చివేసారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేసారని వ్యాపారస్తులు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనలో వున్నారు. పథకం ప్రకారమే ఎమ్మెల్యే వెళ్లాక షాపులు కూల్చివేసి, తమ పొట్ట కొడుతున్నారంటూ చిరు వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేసారు.

ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
కడప
కడప జిల్లాలో విషాదం అలుముకుంది. ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులో ఈతకి దిగిన చిన్నారులు నీటిలో ముగిని మరణించారు. వేసవి సెలవులు కావడంతో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఈతకు వెళ్లిన వారు ఎంతసేపూ తిరిగిరాకపోవడంతో సాయంత్రం వరకూ చూసిన తల్లిదండ్రులు తర్వాత వెదుకులాటను ప్రారంభించారు.

అయితే బంధువుల ఇళ్లలోనూ లేకపోవడంతో సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి వెతకగా పిల్లల దుస్తులు కనిపించాయి. దీంతో ఐదుగురు చిన్నారులు మరణించినట్లు తెలిసిన కుటుంబసభ్యుల రోదన వర్ణనాతీతంగా ఉంది. గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో వెతికించిన తర్వాత ఐదుగురి మృతదేహాలు లభ్యమయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

మేడ్చల్
హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఉప్పల్ భాగాయత్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ భవన స్థలంలో పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన బాలురు అర్జున్ , మణికంఠ గా గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కుటుంబంతోపాటు వలస వచ్చి ఉప్పల్లోని కుర్మానగర్లో నివాసం ఉంటున్నారు.చిన్నారుల తల్లిదండ్రులు అక్కడే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేసుకుంటే జీవనం కోనసాగిస్తున్నారు.
ఇద్దరు చిన్నారులు మంగళవారం సాయంత్రం నుంచి కనిపించక పోవటం వలన పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కుటుంబసభ్యుల ఇచ్చిన ఫిర్యాదులో మిస్సింగ్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు రాత్రి నుండి గాలింపు చేపట్టగా బుధవారం ఉదయం భాగాయత్లో కుల సంఘాల భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తవ్విన పిల్లర్ గుంతలో అర్జున్, మణికంఠ మృతదేహాలు లభ్యమైంది.దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా
అగ్ని ప్రమాదంలో వాహనాలు దగ్గదం
![]()
సికింద్రాబాద్
సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ గ్యారేజీలో పాఠశాల బస్సుకు డెంటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడి పక్కనే ఉన్న లారీ, టాటా ఏస్ వాహనానికి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. లారీ, టాటా ఏస్ వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మృతి

ఏలూరు
ఏలూరు జిల్లా పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది.కుంకాల గ్రామానికి చెందిన గిరిజన మహిళ శిరీష ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. కొంతసేపటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నర్సులు చికిత్స అందించడంతోనే శిరీష మృతి చెందిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. శిరీష మృతదేహాంతో ఆసుపత్రి బయట ఘోరంగా విలపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.