సంక్షిప్త వార్తలు : 21-05-2025

eeroju Daily news website

సంక్షిప్త వార్తలు : 21-05-2025:భారత కమ్యూనిస్టు పార్టీ కారంపూడి మండలం వేపకం పల్లి గ్రామ శాఖ మహాసభను బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి కారంపూడి మండల కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ, వేపకంపల్లి లో పలు సమస్యలను ప్రస్తావించారు. అలాగే జ్ఞాపకం పల్లి ఊరు బయట ఉన్న నాగలేరు బ్రిడ్జి పక్కన సిమెంట్ రోడ్డు అద్వానంగా ఉండి పాదాచార్లకు అలాగే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి తక్షణమే దానికి మరమ్మతులు చేయవలసిందిగా ఆయన కోరారు.

వేపకంపల్లి నాగులేరు ప్రక్కన ఉన్న సిమెంట్ రోడ్డును బాగు చేయండి
భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) సైదా డిమాండ్

కారంపూడి,
భారత కమ్యూనిస్టు పార్టీ కారంపూడి మండలం వేపకం పల్లి గ్రామ శాఖ మహాసభను బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి కారంపూడి మండల కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ, వేపకంపల్లి లో పలు సమస్యలను ప్రస్తావించారు. అలాగే జ్ఞాపకం పల్లి ఊరు బయట ఉన్న నాగలేరు బ్రిడ్జి పక్కన సిమెంట్ రోడ్డు అద్వానంగా ఉండి పాదాచార్లకు అలాగే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి తక్షణమే దానికి మరమ్మతులు చేయవలసిందిగా ఆయన కోరారు.

భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తుందని కాబట్టి ప్రజలందరూ కూడా సిపిఐ పార్టీని ఆదరించి సభ్యులుగా చేరవలసిందిగా ఆయన కోరారు. అనంతరం వేపకంపల్లి శాఖ కార్యదర్శిగా షేక్ చిన్న సైదులు సహాయ కార్యదర్శిగా చాంద్బాషాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైజాను, హోలీ మౌలాలి, సైదులు, నాసర్వలి, తదితరులు పాల్గొన్నారు.

నల్లమల అడవిలో బండరాయిపై వింత రాతలు
పరిశీలించగా వెలుగులోకి ఆశ్చర్యకర విషయాలు

Andhra: అడవిలో ఓ పెద్ద బండరాయిపై వింత రాతలు.. పరిశీలనకు పంపగా వెలుగులోకి  ఆశ్చర్యకర విషయాలు - Telugu News | More Then 500 Year Old Inscription  Unearthed in Nallamala Forest at ...

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా దోర్నాల గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఓ బండ రాయిపై చెక్కిన తెలుగు శాసనం వెలుగులోకి వచ్చింది. ఈ శాసనం స్వచ్ఛమైన తెలుగు భాషలో వ్రాయ బడింది. చెంచులు ఈ శాసనాన్ని గుర్తించి ఫోటోలు తీయడంతో, వీటిని పరిశీలనకు పంపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా డోర్నాల గ్రామానికి సమీపంలో ఉన్న నల్లమల అడవిలో ఓ చెట్టు కింద నంది విగ్రహం, కొన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. అడవిలో తిరుగుతున్న చెంచు గిరిజనులు వీటిని చూశారు.

ఓ రాయిపై ఏవో అక్షరాలు చెక్కి ఉండటాన్ని గమనించి ఫోటోలు తీశారు. వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి ఇవేంటో చెప్పుకోండి చూద్దాం..? అంటూ పజిల్‌ విసిరారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలను చారిత్రక పరిశోధకులు తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ చూసి వీటిని రాజుల కాలంలో రాతిపై చెక్కిన శాసనాలుగా గుర్తించారు. ఈ రాయిపై చెక్కిన అక్షరాలు శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి లిపిగా గుర్తించారు. ఈ ఫోటోలను భారత పురావస్తు అధికారులకు పంపించారు. అక్కడ వాటిని పరిశీలించి, ఇవి 1518 సంవత్సరం నాటివని నిర్ధారించారు.

రైతులు పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి
 ఏపీడి అల్లి పీరన్

పండ్లు తోటలేద్దాం..-Namasthe Telangana

పొలం ఉన్న ప్రతి రైతు పండ్ల తోటల పెంపకాలను ప్రోత్సహించాలని ఉపాధి హామీ ఎమ్మిగనూరు క్లస్టర్ ఏపీడి అల్లిపీరన్ అన్నారు. మంగళవారం సి.బెళగల్ మండలంలోని బ్రాహ్మణ దొడ్డి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధి శ్రామికులతో ఏపీడి అల్లి పీరన్ మాట్లాడుతూ ఉపాధి హామీ శ్రామికులు ప్రతి ఒక్కరూ కొలతల ప్రకారం పని చేస్తే ఒక రోజుకు 307 రూపాయల వేతనం పొందవచ్చని తెలిపారు. అలాగే పొలం ఉన్న ప్రతి రైతు పండ్ల తోటల పెంపకాలను ప్రోత్సహించాలని, అలాగే ప్రతి రైతు పొలంలో ఫారం ఫండ్స్ గుంతలు తవ్వించుకోవాలని తెలిపారు. ఫారం ఫండ్స్ తవ్వించుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు.

అనంతరం బ్రాహ్మణ దొడ్డి గ్రామ సచివాలయంలో బ్రాహ్మణ దొడ్డి గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ పై విచారణ జరిపారు. అనంతరం సి.బెళగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఉపాధి కూలీల రిపోర్టు, ఉపాధి హామీ పని దినాల పెంపు, ఫారం ఫండ్స్, హార్టికల్చర్, నామాలలో నిర్మిస్తున్న కంపోస్ట్ పిట్స్ అంశాలపై గ్రామ పంచాయతీ వారిగా టెక్నికల్ అసిస్టెంట్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం టెక్నికల్ అసిస్టెంట్ల కు పలు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రామన్న, జె.ఈ రంగస్వామి, ఆయా గ్రామాల టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

 

 బాధితులను ఆదుకోవడం కోసమే ముఖ్యమంత్రి సహాయ నిధి
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

నేడు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పర్యటన వివరాలు

బాధితులను ఆదుకోవడం కోసమే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.ఆయన బుదవారం జిల్లా కేంద్రంలోని కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్ లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఎనుముల సంధ్య 9,000, వంగూరు రాజేశ్వరి 11,000, దేవరశెట్టి వేదవతి 17,500, బత్తుల అనిత 25,000, ఆలేటి మౌనిక 14,000, ముచ్చర్ల ఈశ్వరమ్మ 20,000, కాడం సంజీవులు

12000,అస్కని ఉమామహేశ్వరి 14000 రూపాయల చెక్కులను అందజేశారు.ఇట్టి చెక్కులు అందేందుకు కృషి చేసిన బి . రాంచంద్రారెడ్డి కి వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కావలి చిన్నోడు (బాలస్వామి),ఉపాధ్యక్షులు దాది రాములు, నాజా జిల్లా అధ్యక్షులు మందడి చిరంజీవి, ఎస్సీ సెల్ నాయకులు ఇందిరమ్మ కమిటీ మెంబర్ బాపనపల్లి రమేష్, బండమీది లక్ష్మన్న, పెద్దింటి నందీశ్వర్,అస్కని భగవంతు, మరియు బాధితులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment