సంక్షిప్త వార్తలు : 23-05-2025:మావోయిస్టులను ఎన్ కౌంటర్ లో మట్టుపెట్టిన పోలీసులు సంబరాలు చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మావోయిస్టు సుప్రీం లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. వారిని చంపిన అనంతరం మృతదేహాల ముందు డీఆర్జీ (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్) బలగాలు సంబరాలు చేసుకున్నాయి.
సంబరాల్లో పోలీసులు
చింతూరు
మావోయిస్టులను ఎన్ కౌంటర్ లో మట్టుపెట్టిన పోలీసులు సంబరాలు చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మావోయిస్టు సుప్రీం లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. వారిని చంపిన అనంతరం మృతదేహాల ముందు డీఆర్జీ (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్) బలగాలు సంబరాలు చేసుకున్నాయి.
బస్తర్ ఏరియాలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా డీఆర్జీ పని చేస్తోంది. ఉమ్మడి ఏపీలో గ్రేహౌండ్స్ తరహాలో ఛత్తీస్గఢ్ సర్కారు 2008లో దీన్ని ఏర్పాటు చేసింది. ఈ జరిగిన విషయంపై పౌరహక్కుల సంఘం నాయకులు మానవత్వం మరిచి పోలీసులు సంబరాలు చేసుకోవడంపై పలు విమర్శలు గుప్పించారు.
తిరుమలలో నమాజ్ చేయించింది వైకాపా నేతలే

తిరుమల
తిరుమలలో నమాజ్ కలకలంపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ స్పందించారు. తిరుమలలో నమాజ్ చేయించింది వైసీపీ నాయకులు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఘటనలకు పాల్పడటం హేయమైన చర్య అని విమర్శించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నాం.
స్వామి వారికి రక్షణ లేదు అనే విధంగా భక్తులలో అభద్రతా భావాన్ని వ్యక్తపరిచేల వైసీపీ కుటిల రాజకీయం చేస్తోంది. రాజకీయంగా ఎదుర్కోవాలి… స్వామి వారిని అడ్డుపెట్టుకొని ఇలాంటి రాజకీయం చేయడం హేయమైన చర్య . భక్తులను అయోమయంలోకి తీసుకెళ్లే విధంగా వైసీపీ కుట్రలు చేస్తోందని అన్నారు.
ఏసీబీ వలలో తూనికలు కొలతల శాఖా అధికారి

శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పలాసలో తూనిక లు కొలతలు శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ హించారు.ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్ పలువురు వ్యాపారుల నుంచి 1.78 లక్షలు లంచం తీసుకుంటుం డగా రెడ్ హ్యాండెడ్ గా శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పి రమణమూర్తికి పట్టుబడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో శ్రీధర్ ను ప్రవేశ పెడుతున్నట్లు డి.ఎస్.పి మీడియాతో తెలిపారు.
పార్టీ కార్యకర్తలకు అండగా వుంటాం

కాకినాడ
కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని.. మున్సిపల్ శాఖ, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి. నారాయణ భరోసా ఇచ్చారు. కాకినాడలోని గోదావరి కళా క్షేత్రంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా మహానాడు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభకు మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా పాలనలో కార్యకర్తలు కేసులు, అరెస్టులను ఎదుర్కొని పార్టీకి అండగా నిలబడ్డారన్నారు.
మాజీ సీఎం జగన్ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారన్నారు దేశంలో అందరికంటే ఎక్కువగా పింఛన్లు ఇస్తున్నామని, వచ్చేనెల నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్యేలు చినరాజప్ప, కొండబాబు,జ్యోతుల నెహ్రూ, సత్య ప్రభ, జిల్లాలోని ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
