సంక్షిప్త వార్తలు : 27-05-2025

Loyola College committed fraud

సంక్షిప్త వార్తలు : 27-05-2025:విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లయోలా కళాశాల యాజమాన్యం, ఉద్యోగ నియామక అధికారి మోసం చేశారంటూ విద్యార్థులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లయోలా కాలేజ్  మోసం చేసింది

అల్వాల్
విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లయోలా కళాశాల యాజమాన్యం, ఉద్యోగ నియామక అధికారి మోసం చేశారంటూ విద్యార్థులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీ పూర్తికాక ముందే విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ నుండి వాట్సాప్ ద్వారా తమకు సందేశాలు పంపినట్లు విద్యార్థులు తెలిపారు. పది లక్షల రూపాయల చొప్పున ఒక్కో విద్యార్థి నుండి తీసుకుని విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని కళాశాల యాజమాన్యం కన్సల్టెన్సీ అధికారి చెప్పారని విద్యార్థులు తెలిపారు. వారు చెప్పిన విధంగానే మొత్తం ఐదు మంది విద్యార్థులు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలను ఇచ్చినట్లు తెలిపారు.

ఇంట్లో తమ తల్లుల బంగారాన్ని అమ్మి సైతం 10 లక్షల రూపాయలు జమ చేసి వారికి పంపినట్లు తెలిపారు. తీరా నకిలీ విదేశీ ఐడీని సృష్టించి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఇదే విషయమై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. గత మూడు నెలల నుండి ఉద్యోగాల విషయమై కళాశాలకు వచ్చి వెళ్తున్నప్పటికీ తమను పట్టించుకోకుండా తమపైనే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారని కేసులు పెడుతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డబ్బులు తిరిగి ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. వెంటనే తమకు డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పోలీస్ స్టేషన్ సమీపంలో మహిళ దారుణ హత్య

మునీరాబాద్‌లో దారుణం.. మహిళ దారుణ హత్య? | 25-Year-Old Woman Dies In  Munirabad Hyderabad | Sakshi

రాజన్న జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ అతి సమీపంలో మల్లవ్వ అనే మహిళను ఈరోజు అతి కిరాతకంగా హత్య చేశారు. చందుర్తి మండలానికి చెందిన బొల్లు మల్లవ్వ,(60)అనే మహిళ పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ప్రధాన రహదారిపై అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయి  నట్టు తెలిసింది, భూ తగాదాలే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

టాటా మ్యాజిక్ వాహనం బోల్తా..ఆరుగురికి గాయాలు

Una Road Accident: ऊना में ऑल्टो कार ने एक्टिवा को मारी टक्कर, हादसे में  स्कूटी चालक की मौत; पुलिस जांच जारी - Alto car hit Activa in Una scooter  driver died in

దెందులూరు
దెందులూరు జాతీయ రహదారిలో దెందులూరు హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద టాటా మ్యాజిక్ వాహనాన్ని కంటైనర్ ఢీకొనడంతోఆ వాహనం బోల్తా పడి ఆరుగురు గాయాల పాలైన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వాహనంలో పదిమంది ప్రయాణిస్తూ ఉండగా వారిలో ఆరుగురు గాయాల పాలయ్యారు వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.  108 సిబ్బంది క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స కోసం దెందులూరు పిహెచ్ సి కి  తరలించారు.

వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో మృతి

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ కన్నుమూత | Former Wyra MLA Banoth Madan Lal  Passes Away Due To Cardiac Arrest | Sakshi
ఖమ్మం
వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో మృతి చెందారు. కొద్దీ రోజులుగా అనారోగ్యంతో ఏఐజీ చికిత్స పొందుతున్న మదన్ లాల్,  వైసీపీ నుండి 2014 లో వైరా నుండి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. ఆతర్వాత కొద్దీ కాలానికి బీఆర్ఎస్ చేరారు. 2018, 2023 లో జరిగిన ఎన్నికల్లో వైరా నుండి బీఆర్ఎస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసిన ఓటమి చెందారు.

ప్రస్తుతం వైరా బీఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. మదన్ లాల్ స్వగ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం ఈర్లపూడి గ్రామం. మదన్ లాల్  ఈర్లపూడి సర్పంచ్ గా పనిచేసి ఆతర్వాత వైసీపీలో చేరి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.  మదన్ లాల్ భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్యను మంజుల,మృగేందర్ లాల్,కుమార్తె మనీషాలక్ష్మి. కుమారుడు మృగేందర్ లాల్ ఐఏఎస్ తమిళనాడు క్యాడర్, కోడలు కూడా ఐఏఎస్ అధికారి.

డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ “కిల్లర్” నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ‘రక్తిక’ లుక్ రిలీజ్

Killar: సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ "కిల్లర్" - Latest Telugu News |  తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా పాత్రలో నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా..విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.

ఈ రోజు “కిల్లర్” మూవీ నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వజ్ నటించిన ‘రక్తిక’ క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పాత్రలో ఆమె వ్యాంపైర్ లుక్ లో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే “కిల్లర్” మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది. “కిల్లర్” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్, తదితరులు

Related posts

Leave a Comment