సంక్షిప్త వార్తలు : 29-05-2025

సంక్షిప్త వార్తలు : 29-05-2025:సరస్వతి నది పుష్కరాల సందర్బంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి  పుష్కరాలు 12 రోజులలో హుండీ ద్వారా రు.1,36,28,099 ఆదాయం వచ్చినట్లు హుండీల పర్యవేక్షణాధికారి నందనం కవిత తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, సహాయ కమీషనర్  ఆర్ సునిత పాల్గొన్నారు.

సరస్వతి పుష్కర ఆదాయం రెండు కోట్ల 83 లక్షలు.
జయశంకర్ భూపాలపల్లి

సరస్వతి నది పుష్కరాల సందర్బంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి  పుష్కరాలు 12 రోజులలో హుండీ ద్వారా రు.1,36,28,099 ఆదాయం వచ్చినట్లు హుండీల పర్యవేక్షణాధికారి నందనం కవిత తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, సహాయ కమీషనర్  ఆర్ సునిత పాల్గొన్నారు. గదుల అద్దె ద్వారా రు. 1,71,000, హోమముల ద్వారా రు.1,23,000, శీఘ్రదర్శనం ద్వారా రు. 5,60,000,  ప్రసాదముల ద్వారా రు.138,36,552, హుండీల ఆదాయం రు. 1,36,28,099, మొత్తం రు. 2,83,18,651, మిశ్రమ బంగారు 15 గ్రాములు, మిశ్రమ వెండి 1-750 గ్రాములు వచ్చినట్లు పర్యవేక్షణాధికారి నందనం కవితవెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, పుష్కరాల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.

అమీర్పేటలో దూసుకొచ్చిన బస్సు.. హోంగార్డుకు గాయాలు

Hyderabad: One killed in accident in Narsingi-Telangana Today

హైదరాబాద్
ట్రావెల్స్ బస్సు దూసుకురావడంతో హోంగార్డుకు గాయాలైన ఘటన అమీర్పేటలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. పిల్లర్ నంబర్ 1078 ఎదురుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు విధుల్లో ఉన్న ట్రాఫిక్ హోంగార్డ్ బైక్ను ఢీ కొట్టింది. బస్సు కింద బైక్ ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో హోంగార్డుకు గాయాలవగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహరాణా ప్రతాప్ జయంతి

మహారాణా ప్రతాప్ జయంతి 2024: గ్రేట్ ఇండియన్ కింగ్ యొక్క లెగసీని  గుర్తుచేసుకోవడం | దేశం

హైదరాబాద్:
మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకొని ఆసిఫ్ నగర్ డివిజన్ లో బిజెపి సెంట్రల్ జిల్లా స్పోక్స్ పర్సన్ రవికుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక యువత ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని రక్త దానం చేశారు. ప్రమాద సమయాలలో ఎంతోమంది రక్తమంధక మృతి చెందుతున్నారని అలాంటి వారికోసం ఈ రక్తదానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు రవి తెలిపారు.

జీహెచ్ంఎసి లో అవినీతి తారాస్థాయికి చేరుకుంది

జీహెచ్ఎంసీలో రాజ్యమేలుతున్న అవినీతి, నిర్లక్ష్యం! | Corruption and neglect  reigning in GHMC!

హైదరాబాద్
సిసి రోడ్లు వేయకుండానే, రోడ్లు వెసినట్లు చూయించి, 9లక్షలు బిల్లులు మంజూరు చేయించిన విషయం పై  జీహెచ్ంఎసి కమిషనర్ కర్ణన్ కు ఫిర్యాదు చేసామని కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ అన్నారు. ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా, సంతోష్ నగర్ జీహెచ్ంఎసి  సర్కిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ విభాగం పై ఇప్పటికి చర్యలు తీసుకోకుండా విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ తీస్కుకోకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ , జీహెచ్ంఎసి చార్మినార్ జోనల్ ఆఫీస్ ముందు కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ లతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు  ధర్నా నిర్వహించారు.

ఆపరేషన్ కగారు నిలిపి వేయాలంటూ కరపత్రం ఆవిష్కరణ

ఆపరేషన్ కగార్ ఆపేయాలి : వామపక్షాలు

నర్సంపేట మే 29
మధ్య భారత ఆదివాసులపై జరుగుతున్న ఎన్కౌంటర్ లు నిలిపి వేయడంతో పాటు ఆపరేషన్ కగారును ఆపాలని గురువారం నర్సంపేట సిపిఐ ఎం ఎల్ పార్టీ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు మోడెమ్ మల్లేష్ మాట్లాడుతూ, చత్తిస్ ఘడ్ ఆది వాసులపై ఉక్కు పాదం మోపి ఆటవి ఖనిజ సంపద బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించాడు.ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా జూన్ 1న సిటిజన్ క్లబ్లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని కోరాడు. ఈ కార్యక్రమంలో బొర్ర ఆనంద్, ఈర్ల పైడి, భూమా అశోక్, ఈరెల్లి రాంచందర్, శివరాతి కుమారస్వామి, బర్ల గౌరన్న, కడారి సురేష్, కొమ్ముక రవి, భానోత్ రాజు, భానోత్ బాలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment