ChandrababuNaidu : ఉత్తరాంధ్ర వరద విలయం: మృతులకు రూ. 4 లక్షల పరిహారం – సీఎం చంద్రబాబు సమీక్ష

Andhra Floods: CM Chandrababu Reviews North Andhra Devastation; $4800 Compensation for Deceased
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు నలుగురు మృతి

  • సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష 

  • మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం

ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ ప్రకృతి విపత్తులో కంచరపాలెం (విశాఖ), మందస (శ్రీకాకుళం), కురుపాం (మన్యం) ప్రాంతాల్లో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశించారు.

ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఒడిశాలో కురుస్తున్న వర్షాల కారణంగా వంశధార, గోట్టా, తోటపల్లి బ్యారేజీలకు వరద ప్రవాహం పోటెత్తుతోందని అధికారులు సీఎంకు వివరించారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి, విరిగిపడిన చెట్ల తొలగింపు, రహదారుల పునరుద్ధరణ, 90 శాతం మేర విద్యుత్ సరఫరాను తిరిగి నెలకొల్పినట్లు కలెక్టర్లు తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం చూపవద్దని ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించారు.

Read also : PrashantKishor : రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతా – బీహార్ ప్రజల డీఎన్ఏ వ్యాఖ్యలపై ఆగ్రహం

 

Related posts

Leave a Comment