బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ…. తిరుమల, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Tirumala తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమంలో క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు ఎలాంటి ఆంటకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుతూ అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా..శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలికలలో పుట్టమన్ను వేసి.. అందులో నవధాన్యాలు నాటుతారు. ఆ నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. బ్రహ్మోత్సావాల్లో భాగంగా రోజూ…
Read MoreCategory: ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh
Jagan | దూరమైన సొంత సామాజిక వర్గం… | Eeroju news
దూరమైన సొంత సామాజిక వర్గం… కర్నూలు, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Jagan ఎన్నికల్లో జగన్ రెడ్డి సామాజిక వర్గం ఆదరించలేదా? అభిమానం ఉన్న జనాలతో ఓట్లు వేయించ లేదా? ఇంతటి ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటివారు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ రెడ్డి సామాజిక వర్గం సుదీర్ఘకాలం కాంగ్రెస్ వెంట నడిచింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యమిచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అదే సమయంలో వైసీపీ ఉన్నతికి కృషి చేసిన…
Read MoreAP News | మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదం కష్టమే | Eeroju news
మండలి సభ్యుల రాజీనామాలు ఆమోదం కష్టమే విజయవాడ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) AP News ఎమ్మెల్సీ రాజీనామా వ్యవహారంలో వైసీపీ వ్యూహం ఏంటి? నాన్చుడు ధోరణితో వ్యవహరించాలని చూస్తుందా? శాసనమండలి చైర్మన్ ద్వారా ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోందా? ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలిలో టిడిపి కూటమి బలం పెరగకూడదని చూస్తోందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీకి చెందిన పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వైసీపీకి సైతం గుడ్ బై చెప్పారు. ఎప్పుడో ఆగస్టులో తమ పదవులకు రాజీనామా చేస్తే ఇప్పటివరకు అవి ఆమోదం పొందలేదు. అందులో ఇద్దరు స్వయంగా మండలి చైర్మన్ మోసేన్ రాజుకు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. వ్యక్తిగత సమస్యలతోనే తాము పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఎంతవరకు…
Read MorePolavaram | పోలవరం పరుగులే… | Eeroju news
పోలవరం పరుగులే… ఏలూరు, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Polavaram పోలవరం ప్రాజెక్టు పనులు 2026 మార్చికే పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు, పునరావాసం వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ. 30,436,95 కోట్లతో తాజా డీపీఆర్ ను ఆమోదించింది. దీని వల్ల ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రూ. 12,157 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజా డీపీఆర్ ఆమోదం తరువాత ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం కృషితో పోలవరానికి అడ్వాన్స్ గా నిధులిచ్చేందుకూ కేంద్రం ముందుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి రూ. 5,500 కోట్లు, ప్రధాన డ్యాం కాలువల్లో నిర్మాణ పనులకు రూ. 1,700 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమని అధికారుల అంచనా వేశారు. ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల…
Read MoreTeachers | దారి తప్పుతున్న టీచర్లు… | Eeroju news
దారి తప్పుతున్న టీచర్లు… అనంతపురం, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Teachers చదువు బోధించాల్సిన ఉపాధ్యాయులు పక్కా దారి పడుతున్నారు. విద్యా బుద్దులు చెప్పి భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఉపాధ్యాయులే అప్పులు చేసి పంగ నామం పెట్టి పరార్ అవుతున్నాడు. అనంతపురం జిల్లాలో వరుసగా జరుగుతున్న ఉపాధ్యాయుల అప్పుల ఎగ్గొట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి.చదువు బోధించాల్సిన ఉపాధ్యాయులు పక్కా దారి పడుతున్నారు. విద్యా బుద్దులు చెప్పి భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయులు అప్పులు చేసి జనానికి పంగ నామం పెట్టి పరారతున్నారు. అనంతపురం జిల్లాలో వరుసగా జరుగుతున్న ఉపాధ్యాయుల అప్పుల ఎగ్గొట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి. తల్లిదండ్రుల తర్వాత అంతటి వారు ఉపాధ్యాయులు… తల్లిదండ్రులు పిల్లల్ని చక్క బెడతారో లేదో తెలియదు కానీ.. ఎంతో మంది పిల్లలకు చక్కటి చదువులు చెప్పి…
Read MoreYS Jagan | జగన్ బలం..బలగం ఎక్కడ… | Eeroju news
జగన్ బలం..బలగం ఎక్కడ… విజయవాడ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) YS Jagan నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం పడిపోగానే ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. అయితే వైసీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో, మండలిలో, ఇటు లోక్ సభ, రాజ్యసభలో కావాల్సినంత బలం ఉండేది. వాటితో ఎవరిపై ఆధారపడకుండానే సొంతంగానే చట్టాలు చేసుకునే వెసులుబాటు ఉండేది.ఒకవైపు రాష్ట్రంలో శాసనసభ రూపొందించే చట్టాల్లో ఆ పార్టీదే ముఖ్యపాత్ర ఉండేది. మరోవైపు పార్లమెంటులోనూ వైసీపీది చెప్పుకునే స్థాయి పాత్రే. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. వైఎస్ జగన్ పార్టీ ప్రాధాన్యం లేకుండానే కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో బిల్లులు పాస్ కానున్నాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 11…
Read MoreAmaravati | అమరావతికి నిధుల వరదే | Eeroju news
అమరావతికి నిధుల వరదే విజయవాడ, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి నిర్మాణంపై తీపికబురు అందింది. ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులకు ఊతమిచ్చేలా ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ కన్సార్షియం నుంచి కేంద్ర ప్రభుత్వ హామీతో రుణాన్ని మంజూరు చేయడానికి సమ్మతి తెలిపాయి. గత ఐదేళ్లుగా అమరావతి పనులు నిలిచిపోవడంతో పాటు అంతకు ముందు చేపట్టిన పనులకు సంబంధించి దాదాపు రూ.9వేల కోట్ల మేర బిల్లులు బకాయి చెల్లించాల్సి ఉంది.2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారి అమరావతి పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనుల పునురుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి నిధులు గ్యారంటీగా ఇస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. గతంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకులు అమరావతి నిర్మాణానికి రుణాలు…
Read MoreNara Lokesh | లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం… | Eeroju news
లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం… గుంటూరు, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Nara Lokesh నారా లోకేష్ పై కీలక బాధ్యతలు పెట్టారు చంద్రబాబు. పార్టీలో ఇప్పుడు లోకేష్ ప్రాధాన్యత పెరిగింది. అటు ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఉన్నవేళ లోకేష్ సైతం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసే అవకాశం ఉన్నందున వీలైనంతవరకు.. కూటమి పార్టీలతో సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులు సైతం సమన్వయం చేసుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన ఢిల్లీ వెళ్లి పెద్దలను కూడా కలిశారు. అయితే ఇదంతా పక్క వ్యూహంతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంపై చర్చించడానికి లోకేష్ ఢిల్లీ వెళ్ళినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పదవుల పంపకం విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు…
Read MoreCID notice to TDP leader Kolikapudi | కొలికపూడికి నోటీసులు… | Eeroju news
కొలికపూడికి నోటీసులు… విజయవాడ, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) CID notice to TDP leader Kolikapudi టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమరావతి ఉద్యమ నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. గత ఐదేళ్లుగా గట్టిగానే వాయిస్ వినిపించారు. అందుకే చంద్రబాబు పిలిచి మరి తిరువూరు టికెట్ కేటాయించారు. ఆయన గెలుపు కష్టమని అంతా భావించారు. కానీ టిడిపి తో పాటు కూటమి సమన్వయంతో పనిచేయడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తన గెలుపునకు కృషి చేసిన సొంత పార్టీ శ్రేణులకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొలికపూడి. ఇలా గెలిచారో లేదో యంత్రాలతో సిద్ధమయ్యారు. ఓ వైసీపీ నేత ఇంటిని నేలమట్టం చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలను గంటల తరబడి పోలీస్ స్టేషన్లో పెట్టించారు. అంతటితో…
Read MoreDharmavaram Panchayat | తెగని ధర్మవరం పంచాయితీ….. | Eeroju news
తెగని ధర్మవరం పంచాయితీ….. అనంతపురం, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Dharmavaram Panchayat ధర్మవరం.. ఈ నియోజకవర్గం ఆసక్తికర రాజకీయాలకు కేరాఫ్. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఇష్యూతో ధర్మవరంలో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మల్లిఖార్జునను తీసుకురావడం..లోకల్ టీడీపీ క్యాడర్‌కు..లీడర్లకు నచ్చడం లేదు. ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి సత్యకుమారే మల్లిఖార్జునను తిరిగి మున్సిపల్ కమిషనర్‌గా తెచ్చారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.ప్రస్తుత ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున..గత వైసీపీ హయాంలో కూడా మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలకు మల్లిఖార్జున అండగా నిలిచారని..మున్సిపల్ కమిషనర్ సహకారంతో కేతిరెడ్డి రెచ్చిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మల్లిఖార్జున తమను ఎంతో ఇబ్బంది పెట్టారని ఆగ్రహంతో ఉంది టీడీపీ క్యాడర్.వైసీపీ కండువా కప్పుకుంటేనే పనులు చేసి పెడతానని హింసించారని…
Read More