Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైసీపీ , బీజేపీ మధ్య గ్యాప్.

0

ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇన్నాళ్లు స్నేహంగా మెలిగిన పార్టీలు విమర్శలు దాడులు చేసుకుంటున్నాయి. చంద్రబాబు దిల్లీ పర్యటన తర్వాత వైసీపీ , బీజేపీ మధ్య గ్యాప్ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న క్రమంలో కొత్త పొత్తులు వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటన.. ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చింది. చంద్రబాబు బీజేపీ పెద్దలతో భేటీ అవ్వగానే వైసీపీ విమర్శల పదునుపెంచింది. సీఎం జగన్ కాస్త ఆచితూచి మాట్లాడినా.. పార్టీ నేతలు మాత్రం బీజేపీపై మాటల దాడి చేస్తున్నారు.

 

ఇటీవల ఏపీలో పర్యటించిన బీజేపీ పెద్దలు జేపీ నడ్డా, అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై అవినీతి ఆరోపణలు చేశారు. దేశంలో మోస్ట్ అవినీతి, స్కామ్ ల ప్రభుత్వం వైసీపీదని ఘాటుగా విమర్శలు చేశారు. ఇలా బీజేపీ నేతలు విమర్శలు చేసి వెళ్లగానే వైసీపీ నేతలు మైకుల ముందు ప్రత్యక్షం అయ్యారు. బీజేపీ టీడీపీ ట్రాప్ లో పడిందని, టీడీపీ కోవర్టుల స్క్రిప్టులను బీజేపీ నేతల మాట్లాడరంటూ ఆరోపణలు చేశారు. 2019లో టీడీపీ దూరమయ్యాక బీజేపీకి వైసీపీ దగ్గరైంది. ప్రత్యక్షంగా పొత్తులో లేకపోయినా అవసరం వచ్చినప్పుడల్లా బీజేపీకి వైసీపీ మద్దతుగా నిలిచింది. దీంతో ఏపీ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు కేంద్రం కూడా అడపాదడపా సాయం చేస్తుంది.

ఆచితూచి అడుగులు..

బీజేపీ కేంద్ర నాయకత్వంతో వైసీపీ మంచి సంబంధాలు కలిగి ఉంది. ఇలాంటి క్రమంలో బీజేపీ మళ్లీ టీడీపీకి దగ్గరవుతుందా? వైసీపీతో గ్యాప్ వచ్చిందా? అని విషయాలు చర్చ మొదలైంది.అయితే ఇటీవల రాజకీయ పరిస్థితుల మారుతున్నాయి. కర్ణాటకలో ఓటమి పాలైన బీజేపీ… సౌత్ లో పట్టుసాధించేందుకు వ్యూహాలు మారుస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా ఏపీ, తెలంగాణలో పొత్తులపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా తెలంగాణ విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ పాత మిత్రులను మళ్లీ దగ్గర చేస్తుకుంటుంది. ఈ వ్యూహంలో భాగంగానే చంద్రబాబుకు దిల్లీ ఆహ్వానం వచ్చిందని ప్రచారం జరిగింది. అయితే ఏపీలో మాత్రం భిన్న పరిస్థితులు ఉన్నాయి.

 

బీజేపీకి వైసీపీ ముందు నుంచి మద్దతుగా నిలుస్తోంది. ఇటీవల బీజేపీ, వైసీపీకి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తుంది. అందుకు బీజేపీ జాతీయ అధినాయకత్వం సీఎం జగన్ పై విమర్శలు చేయడమే నిదర్శంగా కనిపిస్తుంది. జేపీ నడ్డా, అమిత్ షా ఏపీ పర్యటనలో ఏపీలో శాంతిభద్రతలు లేవని, వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బహిరంగసభల్లో విమర్శించారు.బీజేపీ విమర్శలపై సీఎం జగన్ ఆచితూచి స్పందిస్తూ… బీజేపీ ఏపీకి మద్దతుగా ఉండకపోవచ్చన్నారు. పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ మంత్రులు మాత్రం మాటలదాటి మొదలుపెట్టారు. కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఇలా… మంత్రులు బీజేపీపై ఫైర్ అవుతున్నారు.

 

విశాఖలో రాజకీయ లబ్ది పొందడానికి అమిత్‌షా అవినీతి ఆరోపణలు చేశారని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక, కడుపు మంటలో అవినీతి ఆరోపణలు చేశారంటున్నారు. అమిత్‌షా చెప్పే వరకు ఏపీ బీజేపీ నేతలకు విశాఖలో అక్రమాలు తెలియలేదా అని ప్రశ్నించారు. అమిత్ షా విశాఖ సమావేశంలో టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్‌ చదివారని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఆంధ్రాకు కూడా నిధులు ఇచ్చారని చెప్పుకొచ్చారు.బీజేపీ మాకు అండగా ఉండకపోవచ్చన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. బీజేపీ ఎప్పుడు వైసీపీతో కలిసి ఉందో సీఎం జగన్ చెప్పాలని ప్రశ్నించారు.

దాహం తీర్చండి మహాప్రభో..

ఏపీలో బీజేపీని పలుచన చేయాలనేది సీఎం జగన్ వ్యూహమన్నారు. జగన్‌కు పవన్ ఎందుకు సపోర్టు చేయాలో చెప్పాలన్నారు. పవన్ బీజేపీ మిత్ర పక్షం కాబట్టి తాను మాట్లాడుతున్నానన్నారు. పవన్ తనకు సపోర్టు చేయటం లేదని జగన్ అంటున్నారని, ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ జగన్‌కు సపోర్టు చేయాలా అని సోము వీర్రాజు ప్రశ్నించారు.ఏపీలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే బీజేపీ, వైసీపీ మధ్య గ్యాప్ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. మరికొందరు కావాలనే గ్యాప్ ఇస్తు్న్నారని చెబుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండడంతో బీజేపీ , వైసీపీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా విమర్శలు చేసుకుంటున్నారని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie