A place where you need to follow for what happening in world cup

HOT NEWS

అవినీతి ఎమ్మెల్యేలను బయటపెట్టాలి

0

హైదరాబాద్:అవినీతి ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఅర్ కి వైఎస్సార్టీపీ  అధినేత్రి షర్మిల బహిరంగ లేఖ రాసారు. దళిత బందు స్కీమ్ లో 3 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యే ల లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేసారు.ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు అని స్వయంగా సీఎం ఒప్పుకున్నారు.  ఎమ్మెల్యే ల అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని చెప్పారు.  దళిత బందు స్కీమ్ లో ఒక్కొక్కరి దగ్గర  మూడు  లక్షలు తీసుకున్నారని చెప్పారు.  అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యే పై యాక్షన్ తీసుకుంటాం అన్నారు.  టిక్కెట్ సైతం ఇవ్వమని చెప్పారు.  మరి వాళ్ళ పేర్లు ఎందుకు బయట పెట్టరు అని అడుగుతున్నాం.

లిస్ట్ బయట పెడితే ఎమ్మెల్యేలు తెగిస్తారు అని భయమా..?  పేర్లు బయట పెడితే మీరే అవినీతి పరులు అని అంటారని భయమా..?  కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మీరే 70 వేల కోట్లు తిన్నారు అని అడుగుతారు అని భయమా.?  బిడ్డ లిక్కర్ స్కాం,కొడుకు రియల్ ఎస్టేట్ స్కాం గురించి అడుగుతారని భయమా..?  మీరే అవినీతి చేశారు..మీకు టిక్కెట్ ఎందుకు అని అడుగుతారు అని అనుకున్నారా..?  కేసీఅర్ పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు..కరప్షన్ చంద్రశేఖర్ రావు.  ఎమ్మెల్యేలు కమీషన్లు తింటుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

దళిత బందులోనేనా..లేక మిగతా స్కీమ్ లో చేసిన అవినీతి చిట్టా కూడా ఉందా.  దళిత బందు లో 3 లక్షలు తిన్న ఎమ్మెల్యేల లిస్ట్ బయట పెట్టాలి. . దళిత బందు లో కమీషన్లు తిన్న ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలి. రాష్ట్రంలో 36వేల మందికి దళిత బందు ఇస్తే అందులో అందులో వెయ్యి కోట్లు ఎమ్మెల్యే లు తిన్నారు.  మీరు చెప్పిన లెక్కల ప్రకారమే వెయ్యి కోట్లు అవినీతి జరిగింది. మీ ఎమ్మెల్యేలు అవినీతి పరులు అని మా పాదయాత్ర లోనే నిరూపణ అయ్యిందని అన్నారు.

కమీషన్లు,ప్రభుత్వ భూముల కబ్జా..ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం అవినీతే. నియోజక వర్గాల్లో ప్రతి కాంట్రాక్ట్ మీ ఎమ్మెల్యే లే చేశారు.  మీది సిగ్గుమాలిన ప్రభుత్వం.  మీది అవినీతి ప్రభుత్వం.  మీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం.  మీ ఎమ్మెల్యేలు దొంగలు. 3 లక్షల చొప్పున తిన్న దొంగ ఎమ్మెల్యేల జాబిత బయట పెట్టాలి.  ఏ ఏ ఎమ్మెల్యే ఎంత తిన్నాడో లెక్క చెప్పాలి. . అవినీతి ఎమ్మెల్యే లను భర్తరఫ్ చేయాలి.  కెసిఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి.  మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పదవులకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.