Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పెరగనున్న గ్యాస్ బంఢ ధర…

0

సామాన్యుడు ఈ నెలలోనూ వంట గది మంటను భరించాల్సిందే. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (OMCలు) ఈసారి కూడా కొంచమైనా కనికరం చూపలేదు. ఓవైపు కిరాణా సరుకులు, మరోవైపు కూరగాయల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. కనీసం గ్యాస్‌ రేట్లయినా తగ్గుతాయేమోనని ఆశగా ఎదురు చూసిన దేశ జనానికి తీవ్ర నిరాశ తప్పలేదు. ఎల్‌పీజీ   సిలిండర్‌ల కొత్త రేట్లను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, 14.2 కిలోల సిలిండర్, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలో  ఎటువంటి మార్పు చేయలేదు. అయితే, ఈ రేట్లు ఇప్పటికే పీక్‌ స్టేజ్‌లో ఉన్నాయి, సాధారణ ప్రజలకు మోయలేని భారంగా తయారయ్యాయి.OMCలు ప్రతి నెలా 1వ తేదీన కొత్త గ్యాస్‌ రేట్లను ప్రకటిస్తుంటాయి.

 

అంతర్జాతీయ స్థాయిలో ధరలు భారీగా తగ్గినా, మన దేశంలో మాత్రం గ్యాస్‌ రేట్లను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించడం లేదు. గతంలో వచ్చిన నష్టాలను సర్దుబాటు చేసుకుంటున్నామని, అందువల్లే రేట్లు తగ్గించడం కుదరదని చెబుతున్నాయి.ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో కలిపి కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్ రేటును రూ.255.50 మేర OMCలు తగ్గించాయి. అయితే, అంతకుముందు మార్చి 1వ తేదీన ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటును ఒక్కసారే రూ.350.50 పెంచాయి.దేశ రాజకీయ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ (బ్లూ సిలిండర్‌) రేటు రూ. 1773గా ఉంది.

 

దేశ రాజకీయ రాజధాని ముంబైలో రూ. 1,725, కోల్‌కతాలో రూ. 1,875.50, చెన్నైలో ధర రూ. 1,937 వద్ద ఉన్నాయి.సామాన్యులు ఉపయోగించే డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఈ ఏడాది మార్చి నెలలో రూ. 50 పెంచిన ఓఎంసీలు, ఆ తర్వాత ఇక తగ్గించలేదు. ప్రస్తుతం, దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ (రెడ్‌ సిలిండర్‌) ధర హైదరాబాద్‌లో రూ. 1,155గా ఉంది. దిల్లీలో రూ. 1,103, ముంబైలో రూ. 1,102.5, చెన్నైలో రూ. 1,118.5, బెంగళూరులో రూ. 1,105.5, శ్రీనగర్‌లో రూ. 1,219, లెహ్‌లో రూ. 1,340, ఐజ్వాల్‌లో రూ. 1,260, భోపాల్‌లో రూ. 1,108.50, జైపుర్‌లో రూ. 1,106.50, బెంగళూరులో రూ. 1,105.50 గా ఉంది.

పెళ్లిని ఆపేసిన ఫేస్ బుక్..

దేశంలోని మిగిలిన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 16.2 కేజీల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పట్నాలో రూ. 1,201, కన్యాకుమారిలో రూ. 1,187, అండమాన్‌లో రూ. 1,179, రాంచీలో రూ. 1,160.50, దెహ్రాదూన్‌లో రూ. 1,122, ఆగ్రాలో రూ. 1,115.5, చండీగఢ్‌లో రూ. 1,112.5, అహ్మదాబాద్‌లో రూ. 1,110, సిమ్లాలో రూ. 1,147.50, లఖ్‌నవూలో రూ. 1,140.5 చొప్పున విక్రయిస్తున్నారు. రవాణా ఛార్జీలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వల్ల ఒక్కో రాష్ట్రంలో సిలిండర్ రేట్లు ఒక్కోలా ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie