A place where you need to follow for what happening in world cup

HOT NEWS

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్లే వారికి పక్కా ఏర్పాట్లు చేపట్టండి..మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక

0

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: ఈనెల 14వ తేదీన హైదరాబాదులో జరిగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు జిల్లా నుండి వెళ్లే వారికి పక్కా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.మహబూబాబాద్ లో మంగళవారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఏప్రిల్ 14 వ తేదీన హైదరాబాదులో పెద్ద ఎత్తున నిర్వహించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుండి తరలించేందుకు చేపడుతున్న ప్రణాళికను అధికారులతో సమీక్షించారు.

జిల్లాలో 18 బస్సులు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సుదూర మండలాలకు ఒకరోజు ముందే అనగా 13వతేదీ రాత్రి ఆయా మండల కేంద్రాలకు బస్సులు చేరుకోవాలని అన్నారు దగ్గరగా ఉన్న మండలాలు 14వ తేదీ ఉదయం నాలుగున్నర గంటల వరకు బస్సులు చేరుకునే విధంగా ఆర్టిఏ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దూర ప్రాంతాల నుండి వేసే బస్సులకు తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లను నియమించాలన్నారు.ప్రతి బస్సుకు ఇద్దరు నోడల్ అధికారులుగా ఉంటారని ఒకరు జిల్లా మండలాధికారిగా మరొకరు పోలీస్ అధికారి ఉంటారన్నారు. ప్రతి బస్సులో 50 మంది సీటింగ్ కెపాసిటీ వరకు పాసులు జారీ చేయాలని జారీ చేసిన వారికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం నాణ్యమైన ఆకుకూరలతో భోజనం సాయంత్రం స్నాక్స్ తిరుగు ప్రయాణం రాత్రి వేళల్లో డిన్నర్ ఏర్పాటు చేయాలన్నారు.

ప్రతి బస్సులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని, మజ్జిగ ప్యాకెట్స్ ఏర్పాటు చేయాలని, సమృద్ధిగా త్రాగునీరు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
మహిళా ప్రతినిధులు ఉన్న బస్సులకు తప్పనిసరిగా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు నియమించాలన్నారు.ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని సజావుగా జరిగే విధంగా అధికారులు పర్యవేక్షిస్తూ విజయవంతం చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాషఅభినవ్, డేవిడ్,జెడ్పీసీఈవో రమాదేవి, ఆర్ డిఓ లు కొమరయ్య, రమేష్ ఉద్యాన అధికారి సూర్యనారాయణ, పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్, డిఆర్ డిఓ సన్యాసయ్య, పంచాయతీ అధికారి దన్ సింగ్, ఆర్టిఏ రమేష్ రాథోడ్, ఆర్టీసీ డిపోమేనేజర్ జైవిజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.