A place where you need to follow for what happening in world cup

ఉస్తాద్’‌ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్.

0

పవన్ కల్యాణ్ విషయంలో పూనమ్ కౌర్ ఎప్పుడూ వార్తలలో ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి పవన్ కల్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తూ ఆమె పోస్ట్ చేయడంతో.. ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ ఆమెపవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల నిమిత్తం విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్‌పై నటి పూనమ్ కౌర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడి పేరుని హీరో కాళ్ల కింద పెట్టడం ఏమిటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈ సినిమాపై ఆమె చేసిన పోస్ట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలే పవన్ కల్యాణ్ విషయంలో పూనమ్ కౌర్ ఎప్పుడూ వార్తలలో ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి పవన్ కల్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తూ ఆమె పోస్ట్ చేయడంతో.. ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏమని ట్వీట్ చేసిందంటే.. ‘‘మీరు స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించలేకపోతే పోయారు కానీ, కనీసం అవ‌మానించ‌కుండా ఉండండి. తాజాగా విడుద‌లైన ఓ సినిమా పోస్ట‌ర్‌లో భ‌గ‌త్ సింగ్ పేరును పాదాల కింద ఉంచి అవ‌మానించారు..

 

ఇది అహంకారమా? అజ్ఞానమా?’’ అని ప్రశ్నించిన పూనమ్ కౌర్.. మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వారు పోస్ట్ చేసిన ఈ పోస్టర్‌‌కు రిప్లమ్ ఇస్తూ.. ‘ఇది ఖచ్చితంగా స్వాతంత్ర్య సమరయోధుడిని అవమానించడమే.. దీనిని వెంటనే భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి’ అంటూ రత్నదీప్ చక్రవర్తి అనే అతనికి ట్యాగ్ చేసింది.అయితే పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు కొందరు సపోర్ట్ చేస్తుంటే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోండి. రాజకీయం‌గా కూడా మీకు మంచి పేరు వస్తుంది.

అమెరికా కాల్పుల్లో తెలుగు యువతి మృతి

అంతేకానీ.. ఇలా లేనిపోని కాంట్రవర్సీలతో ఫేమస్ అవ్వడానికి ప్రయత్నం చేయవద్దు, సినిమా పోస్టర్‌ని పోస్టర్‌లా చూడండి.. అలా చూడటం రాకపోతే.. చూడటం మానేయండి, భగత్ సింగ్ పేరు పెట్టుకున్న వాళ్లంతా మంచి పనులే చేస్తున్నారా? పోస్టర్‌కి నానా యాగీ చేస్తున్నావ్, నిన్నెవరూ పట్టించుకోవడం లేదని.. ఇలా ఫేమస్ అవుదామని చూస్తున్నావా? అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్‌తో పూనమ్‌పై ఫైర్ అవుతున్నారు. కాగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.