Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మానవాళి శ్రేయస్సు కోసం సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం – భక్తుల నుండి టిటిడికి అభినందనలు.

0

తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో మంగళవారం ఉదయం 6 గంటలకు సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో  ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల కెఎస్‌ఎస్‌ అవధాని మాట్లాడుతూ, సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ టిటిడి సంపూర్ణ అఖండ సుందరకాండ పారాయణాన్ని చేపట్టిందన్నారు. “హనుమంతుడు సీతాదేవిని కలుసుకుని తిరిగి మహేంద్రగిరికి రావడానికి 16 గంటల సమయం పట్టిందని చెప్పారు.

చేతులు మాత్రమే కలుస్తున్నాయి..

కాబట్టి సుందరకాండలోని 2,872 శ్లోకాలను 16 గంటల్లో పఠించడం ద్వారా మనం అన్ని సమస్యల నుండి, పాపాల నుండి విముక్తి పొందుతాము” అని ఆయన పేర్కొన్నారు. రుత్వికులు పారాయణంతో పాటు ఏకకాలంలో యాగం కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య దాదాపు 16 గంటల పాటు నిర్విరామంగా అఖండ పారాయణ యజ్ఞం కొనసాగనుంది. నాలుగు బృందాల్లో వేద పండితులు ఈ శ్లోకాలను ఒక బృందం తరువాత మరొక బృందంగా పటించనున్నారు. మొదట సంక్షిప్త రామాయణం నుండి 100 శ్లోకాలు తరువాత సుందరకాండలోని శ్లోకాలు పారాయణం చేస్తున్నారు.

చేతులు మాత్రమే కలుస్తున్నాయి..

ఒకవైపు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు, మరో వైపు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత రాముడు, మరో వైపు రుక్మిణీ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులు ఉండగా ధర్మగిరిలోని ప్రార్థనా మందిరాన్ని వివిధ దేవతామూర్తులతో అలంకరించారు. వివిధ చోట్ల ఆంజనేయుడి దివ్యరూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశం నలుమూలలతోపాటు విదేశాల నుండి సైతం భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్లోక పారాయణంలో పాల్గొన్నారు. ఈ పారాయణ కార్యక్రమాని నిర్వహిస్తున్న టీటీడీకి భక్తులు అభినందనలు తెలియజేశారు.

 

వేదపండితులు, భక్తులు చేసిన అఖండ సుందరకాండ పారాయణంతో ధర్మగిరి ప్రాంగణం మారుమోగింది.  అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ రఘునాథ్ బృందం శ్రీ హనుమాన్ జై హనుమాన్ భజనతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ పండితులు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్  రాణిసదాశివమూర్తి, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్  విభీషణ శర్మ, ధర్మగిరి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం,  ఎస్వీ ఉన్నత వేద అధ్యయనాలు

నిర్మాణాత్మక ఎత్తుగడలకు దూరమేనా.

తదితర వేద పండితులు, విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. సీఈవో ఎస్వీబీసీ  షణ్ముఖ్ కుమార్, ఎస్ఈ 2  జగదీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, వీజీఓ  బాలిరెడ్డి, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్  శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆకాశ‌గంగ‌, జాపాలిలో ఆకట్టుకున్న ధార్మిక‌, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా నాదనీరాజనం, ఆకాశ‌గంగ, జ‌పాలి తీర్థంలో నిర్వహిస్తున్న ధార్మిక, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie