పల్నాడు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం మాచర్లలో ప్రజావేదిక సభలో చంద్రబాబు ప్రసంగం రాష్ట్రంలో చెత్త రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఉద్ఘాటన పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఇటీవల వరకు ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే, తన లాంటి నాయకుడు కూడా అక్కడికి వెళ్లలేని దుస్థితి ఉండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితులు కల్పించామని ఆయన తెలిపారు. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మాచర్లలో నిర్వహించిన ‘ప్రజా వేదిక’ బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో కేవలం చెత్తనే కాకుండా, “చెత్త రాజకీయాలను” కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. “పల్నాడులో అరాచకాలు, దాడులు చేస్తే సహించేది లేదు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే…
Read MoreTag: #AndhraPradesh
AP : ఏపీ లిక్కర్ స్కామ్: ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు
50కి పైగా ప్రశ్నలు సంధించిన అధికారులు ఒక్కదానికీ సరైన జవాబివ్వని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రెండోరోజు విచారిస్తున్న సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో అధికారులు ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించి విచారిస్తున్నారు. మొదటి రోజు విచారణ మొదటి రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ నాలుగు గంటల వ్యవధిలో అధికారులు మిథున్ రెడ్డిని 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ముఖ్యంగా రూ.5 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము ఆయన కుటుంబీకులకు చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాల్లో జమకావడంపై ప్రధానంగా ప్రశ్నించారు. అయితే, మిథున్ రెడ్డి ఏ ఒక్క…
Read MorePawanKalyan : ఆంధ్రప్రదేశ్‌లో ప్లాస్టిక్ రహిత రాష్ట్రం దిశగా ముందడుగు
ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక కార్యాచరణ రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయి ప్రణాళిక వెల్లడి రాజకీయ నాయకుల నుంచే మార్పు మొదలవ్వాలని పిలుపు ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో పటిష్టమైన ప్రణాళికను తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. ప్లాస్టిక్ మన జీవితంలో ఒక భాగమైపోయిందని, దీనికి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుందని, ఇది మైక్రో, నానో పార్టికల్స్ రూపంలో పశువుల కడుపులోకి, చివరికి శిశువుల రక్తంలోకి కూడా చేరుతోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం…
Read MoreAndhraPradesh : ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు
ఏపీ డీఎస్సీ ఫలితాల్లో ఉరవకొండ యువకుడికి ఐదు టీచర్ ఉద్యోగాలు చేనేత కార్మికుల కుటుంబానికి చెందిన శ్రీనివాసులు ఘనవిజయం 2018లో కేవలం ఒక్క మార్కు తేడాతో ఉద్యోగాన్ని కోల్పోయిన యువకుడు పట్టుదల ఉంటే పేదరికం గెలుపునకు అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఇటీవల విడుదలైన ఏపీ డీఎస్సీ ఫలితాల్లో ఏకంగా ఐదు టీచర్ ఉద్యోగాలను సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఉరవకొండలోని పదో వార్డు రంగావీధిలో నివసించే రొడ్డ వరలక్ష్మి, ఎర్రిస్వామి దంపతుల కుమారుడు శ్రీనివాసులు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన శ్రీనివాసులు, ఎలాగైనా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దూరవిద్యలో డిగ్రీ, ఎస్‌కే యూనివర్సిటీలో బీఈడీ పూర్తిచేశాడు. అయితే, అతని ప్రయాణం అంత సులువుగా…
Read MoreNaraLokesh : మార్షల్‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం
అసెంబ్లీ లాబీలో మార్షల్స్ తీరుపై మంత్రి లోకేశ్ ఆగ్రహం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో మార్షల్ దురుసు ప్రవర్తన మీడియాతో మాట్లాడుతుండగా నెట్టేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మార్షల్ ఎమ్మెల్యే పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలోనే ఉన్నామనుకుంటున్నారా?” అంటూ సిబ్బందికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘటన గురువారం అసెంబ్లీ లాబీలో చోటు చేసుకుంది. మంత్రి లోకేశ్ ఛాంబర్ వెలుపల టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో, అక్కడికి వచ్చిన ఓ మార్షల్ లాబీలో ఉండకూడదని చెప్పారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే నరేంద్రపై చేయి వేసి పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు.…
Read MoreAP : ఆంధ్రప్రదేశ్ లోని ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఓ సైనికురాలు
రోజా విజయగాథ: సైనికురాలి నుంచి ఉపాధ్యాయురాలిగా సరిహద్దులో సైనికురాలు, తరగతి గదిలో టీచర్ చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమానుపల్లెకు చెందిన రోజా, ఒక అసాధారణమైన మహిళ. సైనికురాలిగా దేశ సరిహద్దుల్లో సేవలు అందిస్తూనే, ఆమె తన కల అయిన ఉపాధ్యాయ వృత్తిని సాధించారు. 2018లో ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యే అవకాశం కోల్పోయినప్పటికీ, ఆమె నిరాశ చెందలేదు. బదులుగా, 2022లో ఆమె బీఎస్‌ఎఫ్ జవానుగా ఎంపికై, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో విధి నిర్వహణలో ఉన్నప్పటికీ, ఆమె తన ఉపాధ్యాయ కలని మర్చిపోలేదు. ఖాళీ సమయాల్లో డీఎస్సీకి సిద్ధమై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో 83.16 మార్కులతో విజయం సాధించారు. దేశానికి సేవ చేస్తూనే, ఉపాధ్యాయురాలిగా తన లక్ష్యాన్ని చేరుకున్న రోజా ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. Read also : RamMohanNaidu : సామాన్యులకు చేరువైన…
Read MoreAP : మహిళా ఆరోగ్యమే కుటుంబానికి బలమైన పునాది
విశాఖలో ‘స్వస్త్ నారీ’ కార్యక్రమం… హాజరైన నిర్మలా సీతారామన్, చంద్రబాబు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశే మా నినాదం అన్న చంద్రబాబు ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ‘స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, ఆ తరువాత రాష్ట్రం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ‘స్వస్త్ నారీ-సశక్త్ పరివార్’ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 13,944 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య…
Read MoreNaraLokesh : రాష్ట్రాభివృద్ధికి మూడు కీలక అంశాలు: లండన్‌లో మంత్రి లోకేశ్
క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలతో రాష్ట్ర రూపురేఖల మార్పు ఖాయం ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలు పరిశ్రమల ఏర్పాటుకు అవరోధంగా ఉన్న నిబంధనల సరళీకరణ ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార నిర్వహణ వేగాన్ని (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపిస్తున్నామని, దీనికి నిదర్శనంగానే గడిచిన 15 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు సాధించగలిగామని రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘భాగస్వామ్య సదస్సు – 2025’కు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు లండన్‌లో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ – యూకే బిజినెస్ ఫోరం’ రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.…
Read MoreAP : రాజధాని అమరావతిలో కేబుల్ వంతెన నిర్మాణం – ఒక కొత్త శకం!
ఐకానిక్ వంతెన డిజైన్ ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు ఓటింగ్ లో ఎక్కువ మంది మొగ్గుచూపిన డిజైన్ ను ఖరారు చేసిన సీఎం కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ కు అత్యధిక ఓట్లు రాజధాని అమరావతిలో నిర్మించనున్న కేబుల్ వంతెన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. అత్యాధునిక సాంకేతికతతో, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నమూనాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఖరారు చేశారు. ఈ వంతెన నమూనా ఎంపిక కోసం గతంలో సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ప్రజా ఓటింగ్ నిర్వహించగా, అత్యధిక ఓట్లు సాధించిన రెండో నమూనాను ఫైనల్ చేశారు. కూచిపూడి నృత్య భంగిమలో డిజైన్ ఈ వంతెన కూచిపూడి నృత్యంలోని ‘స్వస్తిక హస్త’ ముద్రను పోలి ఉండటం ఒక ప్రధాన…
Read MoreIndiaPost : ఇండియా పోస్ట్ పేరుతో నకిలీ మెసేజ్‌లు – సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ!
ఇండియా పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పార్శిల్ వచ్చిందంటూ ఫేక్ ఎస్సెమ్మెస్‌లతో మోసగాళ్ల వల అడ్రస్ అప్‌డేట్ చేయాలంటూ మోసపూరిత లింకులు మీకు “మీ పార్శిల్ వచ్చింది, కానీ అడ్రస్ సరిగా లేకపోవడంతో డెలివరీ చేయలేకపోయాం. 48 గంటల్లోగా ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు అప్‌డేట్ చేయండి, లేదంటే పార్శిల్ వెనక్కి వెళ్లిపోతుంది” అని ఇండియా పోస్ట్ పేరుతో ఎప్పుడైనా మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్తగా ఉండండి! ఇది సైబర్ మోసగాళ్లు పంపిస్తున్న నకిలీ మెసేజ్ అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మెసేజ్‌లోని లింక్‌ని క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు మొత్తం పోతుందని ప్రభుత్వం చెప్పింది. ఈ మోసగాళ్లు ఇండియా పోస్ట్ లాంటి ప్రభుత్వ సంస్థల పేరుతో ప్రజలకు నకిలీ మెసేజ్‌లు పంపిస్తున్నారు. పార్సెల్ డెలివరీలో ఏదైనా సమస్య ఉందంటూ…
Read More