Akbaruddin Owaisi suspended the speaker in the assembly | అసెంబ్లీలో స్పీకర్ ను నిలదీసిన అక్బరుద్దీన్ ఓవైసీ | Eeroju news

అసెంబ్లీలో స్పీకర్ ను నిలదీసిన అక్బరుద్దీన్ ఓవైసీ

అసెంబ్లీలో స్పీకర్ ను నిలదీసిన అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఆగష్టు 1 Akbaruddin Owaisi suspended the speaker in the assembly శాసన సభను క్రమశిక్షణలో పెట్టడమో, లేదంటే సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడమో, లేదంటే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న వారిని సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి చేయాలని ఎంఎంఐ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సభాధ్యక్షుడు గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు.  ఇంతకీ ఏం జరిగిందంటే.. బిఆర్ఎస్ ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని సిఎం రేవంత్‌రెడ్డి అవమానించారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ సభ్యులు ఈ రోజు సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభలో సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతూ నిరసన తెలిపారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకే ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ అంశంపై చర్చించాలని సిఎం రేవంత్…

Read More

CM Revanth Reddy is angry with BRS | బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం | Eeroju news

CM Revanth Reddy is angry with BRS

బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం హైదరాబాద్ CM Revanth Reddy is angry with BRS విపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదు అక్కలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా ఒక అక్క నన్ను నడి బజారులో వదిలేసింది.. ఎన్నికల కోసం నేను వెళ్తే. ఇంకో అక్క నాపై 2 కేసులు పెట్టిందదని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికీ నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, నేను సొంత అక్కలుగానే భావిస్తున్నా. సీఎం రేవంత్‌ సీతక్కను కుటుంబసభ్యురాలిగా చూసుకుంటా ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులు అయ్యారు దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న మీరు ఏమయ్యారు. సొంత చెల్లెలు జైలులో ఉంది ఆ చెల్లెలు గురించి మాత్రం మాట్లాడరు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారు డిప్యూటీ సీఎం ఇచ్చి బర్తరఫ్‌ చేశారు. సీఎం రేవంత్‌ మండిపడ్డారు.     Second angle…

Read More

30 years of struggle has been served | 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది | Eeroju news

30 years of struggle has been served

30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది న్యూఢిల్లీ, ఆగస్టు 1 30 years of struggle has been served ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రత్మక తీర్పు వెల్లడించింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయ స్థానం తమ తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో ఈ తీర్పును వెలువరించింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని పేర్కొన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది. కాగా.. సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణమాదిగ భావోద్వేగానికి గురయ్యారు.. మీడియా ఎదుట కంటనీరు పెట్టుకున్న మంద కృష్ణ.. తమ 30 ఏళ్ల పోరాటానికి…

Read More

BRS protest with black badges | నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నిరసన | Eeroju news

BRS protest with black badges

నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నిరసన హైదరాబాద్, ఆగస్టు 1 BRS protest with black badges తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నిరసన తెలిపింది. బుధవారం సీఎం, డిప్యూటీ చేసిన మహిళలపై చేసిన కామెంట్స్‌కు క్షమాపణలు చెప్పాల్సిన ఆ పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌కు నిరసనగానే ఇలా నల్లబ్యాడ్జీలతో సభకు హాజరైనట్టు సభ్యులు పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని సభలో కూడా బీఆర్‌ఎస్‌ సభ్యులు డిమాండ్ చేశారు. ఓవైపు మంత్రులు బిల్లులు ప్రవేశపెడుతున్నారు మరోవైపూ బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్‌కు సభలో క్షమాపణ చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేశారు. అప్పటి వరకు తమ నిరసన కొనసాగుతుందని గట్టిగా అరుస్తూ చెప్పారు. దీనిపై మాట్లాడేందుకు తమక అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు…

Read More

Arrest of BRS MLAs Speaker is serious about dharna videos | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ | Eeroju news

BRS

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ – ధర్నా వీడియోలపై స్పీకర్ సీరియస్     హైదరాబాద్, ఆగస్టు 1 Arrest of BRS MLAs Speaker is serious about dharna videos తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ ముందు ధర్నా చేస్తున్న  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకు వచ్చారు. వారిని తర్వాత పోలీసులు అరెస్టు చేసి బస్సులో స్టేషన్‌కు తరలించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం సరి కాదని.. స్పీకర్ చాంబర్ ముందు నుంచి అందరూ వెళ్లిపోవాలని చెప్పినా కదలకపోవడంతో.. మార్షల్స్ వారిని ఎత్తుకుని తీసుకెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తలించారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా వ్యవహారం వివాాస్పదమయింది. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి…

Read More

Seasonal diseases | వ్యాప్తి చెందుతున్న సీజనల్ వ్యాధులు | Eeroju news

Seasonal diseases

వ్యాప్తి చెందుతున్న సీజనల్ వ్యాధులు హైదరాబాద్, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) Seasonal diseases తెలంగాణలో ఈ ఏడాది భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై డెంగ్యూ ప్రభావం ఉన్నట్లు సమాచారం. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, నిలోఫర్ లో డెంగ్యూ జ్వరాలతో వస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. డెంగ్యూ ఫీవర్ పట్ల నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఐదారు రోజులకు పరిస్థితి విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ నివేదిక ప్రకారం తెలంగాణలో జులైలోనే 722 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు మొత్తం 1800 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. జనవరి నుంచి జూన్ వరకు 1,078…

Read More

Chicken thieves causing a stir | కలకలం రేపుతున్న కోళ్ల దొంగలు | Eeroju news

Chicken thieves causing a stir

కలకలం రేపుతున్న కోళ్ల దొంగలు కరీంనగర్, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) Chicken thieves causing a stir పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, రామగుండం సమీపంలోని బ్రాహ్మణపల్లి గ్రామాల్లో రెండు రోజుల్లో 30 కోళ్ళు చోరీ గురయ్యాయి. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా కోళ్లను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా ఠాణాల పోలీసులు కోళ్ల దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏపీలో కోస్తా జిల్లాల్లో జరిగే కోడి పందాలకు తెలంగాణ కోళ్లు తరలివెల్తున్నాయన్న విషయం ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఏపీలో పౌరుషంతో పెరిగే కోళ్లతో పాటు తెలంగాణలో ఉక్రోషం, పౌరుషం కలగలిపి, బలవర్ధకంగా తయారైన కోళ్లకు కూడా సంక్రాంతి సందర్బంగా డిమాండ్ ఎక్కువగానే ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. కోళ్లను చోరీ చేసేందుకు…

Read More

Loan waiver | రుణమాఫీలో మిస్సింగ్ లిస్ట్… | Eeroju news

Loan waiver

రుణమాఫీలో మిస్సింగ్ లిస్ట్…. కరీంనగర్, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) Loan waiver పంట రుణాల మాఫీతో రైతన్నలో సంబురాలతో పాటు కొందరిలో ఆందోళన నెలకొంది. లక్ష, లక్షన్నర రుణం ఉన్నా మాఫీ జాబితాలో పేర్లు లేక పోవడంతో రైతన్నను కలవరపెడుతోంది. ఫస్ట్, సెకండ్ జాబితాలో లక్షన్నర వరకు క్రాప్ లోన్ ఉన్నా మాఫీ కాకపోవడం అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. అధికారుల చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడింది. చిన్న చిన్న సమస్యలను షాకు గా చూపి చాలామంది రైతులను రుణం మాఫీకి దూరం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల 75 వేల మంది రైతులకు సంబంధించి 12 వేల 225 కోట్లు ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేసింది. తొలి విడత ఈనెల 18న లక్ష రూపాయల వరకు…

Read More

Chitti Dosha | చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు | Eeroju news

Chitti Dosha

చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు అనంతపురం, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) Chitti Dosha సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు జీతాలు లక్షల్లో ఉంటాయి. అందుకే నేటి యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఎగబడుతుంటారు. అయితే రోడ్డు పక్కన దోసెలు అమ్ముకునే ఓ మహిళ టెక్కీలే ఆశ్చర్యపోయేలా సంపాదిస్తుంది. రోజుకు రూ.10 వేలు వ్యాపారం చేస్తామని నర్సమ్మ అంటున్నారు. ఇందులో గొప్పేంటి అనుకుంటున్నారా? రోడ్డు పక్కన చిన్న షెడ్డులో మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కాకా హోటల్ నడుపుతూ.. రోజుకు రూ.10 వేల వ్యాపారం చేస్తున్నారంటే…గొప్పే కదా అంటున్నారు స్థానికులు. ఒకరిపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే వారికి నర్సమ్మ ఆదర్శమే అంటున్నారు. సత్యసాయి జిల్లాలోని కదిరికి సమీపంలోని కూటగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున నెలకు దాదాపు రూ. 3…

Read More

School Management Committee Election Schedule | స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ | Eeroju news

స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక‌ల షెడ్యూల్‌

స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ ఒంగోలు, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) School Management Committee Election Schedule ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. పాఠ‌శాలల్లో ఉన్న పేరెంట్స్ క‌మిటీల‌ స్థానంలో స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీలను నియమించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక ఆగ‌స్టు 8న నిర్వహించ‌నున్నారు. ఈ మేరకు రాష్ట్ర స‌మ‌గ్ర శిక్ష డైరెక్టర్ డి. శ్రీనివాస‌రావు షెడ్యూల్ విడుద‌ల చేశారు. 2021 సెప్టెంబ‌ర్ 22న ఏర్పాటు చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీల‌ను 2023 సెప్టెంబ‌ర్ 21తో రెండేళ్ల ప‌ద‌వీకాలం పూర్తి చేసుకున్నాయి. అయితే 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే వరకు కొనసాగించారు. ఆగ‌స్టు 8న ఈ క‌మిటీలకు ఎన్నిక‌లు నిర్వహించాలని అన్ని జిల్లాల డీఈఓలు, అడిష‌న‌ల్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్స్‌కు రాష్ట్ర స‌మ‌గ్ర శిక్ష డైరెక్టర్ డి. శ్రీనివాస‌రావు ఉత్తర్వులు ఇచ్చారు.…

Read More