Mallareddy : మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపై మల్లారెడ్డి అసహనం, ఈటల రాజేందర్ ఆగ్రహం”

Mallareddy Expresses Discontent Over Medchal Constituency Development; Etela Rajender Slams Alcohol and Ganja Sales

Mallareddy : మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపై మల్లారెడ్డి అసహనం, ఈటల రాజేందర్ ఆగ్రహం:మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషికి కనీస గౌరవం కూడా లభించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపై మల్లారెడ్డి అసహనం, ఈటల రాజేందర్ ఆగ్రహం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషికి కనీస గౌరవం కూడా లభించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్…

Read More

What is Mallareddy’s master plan? | మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటీ | Eeroju news

Mallareddy

మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటీ హైదరాబాద్, జూలై 12 (న్యూస్ పల్స్) What is Mallareddy’s master plan? తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే నేత మాజీ మంత్రి మల్లారెడ్డి. మాస్ మల్లన్నగా అందరూ ముద్దుగా పిలుచుకునే మల్లారెడ్డి తన రాజకీయ జీవితాన్ని కీలక మలుపు తిప్పాలని నిర్ణయించుకున్నారట. స్వతహాగా వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేతగా బాగా ఫేమస్ అయ్యారు. ఇక 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు. మల్లారెడ్డి అంటేనే ఓ బ్రాండ్‌గా అందరికీ గుర్తిండిపోయారు. 2014లో తొలిసారిగా మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి… ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరి… రాష్ట్రమంత్రి కూడా అయిపోయారు.ఇక గత ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా, బీఆర్ఎస్ ఓడిపోవడంతో మల్లారెడ్డికి కష్టాలు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా…

Read More

పెద్ద ప్లాన్ లో మల్లారెడ్డి… | Mallareddy in big plan… | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) ఏపీలో బంపర్ మెజార్టీతో చారిత్రక విజయం నమోదు చేసింది టీడీపీ. ఈ సారి ఎన్నికల్లో పోటీచేయని టీడీపీ తెలంగాణలో దాదాపు మూతపడింది. దాంతో ఇప్పుడు సైకిల్ పార్టీకి తెలంగాణంలో డిమాండ్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్‌లో చేరదామంటే అక్కడ తలుపులు తెరుచుకోని బీఆర్ఎస్ నేతలకు టీడీపీనే దిక్కులా కనిపిస్తుందంట. అలాంటి వారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ముందు వరుసలో కనిపిస్తున్నారు. సైకిల్ ఎక్కేందుకు ఆయన చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారంట. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు దిగి సైకిల్ ఎక్కేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య నేతలతో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి సమాలోచనలు జరిపారంట. ఆస్తుల రక్షణకు మల్లారెడ్డి తెలంగాణలో సరికొత్త రాజకీయానికి తెరలేపే ఆలోచనలో ఉన్నారంట. మల్లారెడ్డి…

Read More

మల్లారెడ్డికి టీటీడీపీ బాధ్యతలు..? | TTDP responsibilities for Mallareddy..? | Eeroju news

హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాలు తర్వాత ఊహించని మార్పులు వస్తాయని నేతలు బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దాదాపు ఆరుగురు నేతలు ఇప్పటికే అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు అందులోని సారాంశం. అదే జరిగితే కారు పార్టీ ఖాళీ కావడం ఖాయమని చర్చించుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లపాటు పాలించింది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. అందులోని నేతలంతా దాదాపు టీడీపీ నుంచి వెళ్లినవారే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి గెలిచినవాళ్లలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లినవారు ఉన్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More