సంక్షిప్త వార్తలు: 04-12-2025:వనజీవి రామయ్య మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేసారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వృక్షో రక్షతి రక్షితః అనే పెద్దల మాటలోని వాస్తవాన్ని ప్రజలకు తెలియచేసేందుకు రామయ్య పడ్డ తపన సమాజానికి ఎంతో మేలు చేస్తోంది. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్ను మూత పద్మశ్రీ వనజీవి రామయ్య కన్ను మూత:పద్మశ్రీ అవార్డు గ్రహీత వృక్ష ప్రేమికుడు దరిపెల్లి. రామయ్య (వనజీవి రామయ్య) కన్నుమూశారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను *2017లో…
Read More