సంక్షిప్త వార్తలు:04-18-2025:ఉపాధి కూలీలు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి అడవి ప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలి గిట్టుబాటు కావడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ఆరోపించారు. శుక్రవారం మంథని మండలం మైదుపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు అడవి ప్రాంతంలో చేస్తున్న పని ప్రదేశాన్ని ఆయన సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ మైదుపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఎర్రటి ఎండలో నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అడవి ప్రాంతంలో ఉపాధి పనులు చేస్తున్నారని వీరికి ట్రావెలింగ్ చార్జీలు ఇవ్వటం లేదని విమర్శించారు. ఉపాధి కూలీలకు ట్రావలింగ్ చార్జీలు ఇవ్వాలి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి పనిచేసిన గిట్టుబాటు గాని కూలి …
Read More