YS Jagan | గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లలో జగన్ బుక్కైనట్టేనా | Eeroju news

గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లలో జగన్ బుక్కైనట్టేనా

గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లలో జగన్ బుక్కైనట్టేనా విజయవాడ, నవంబర్ 27, (న్యూస్ పల్స్) YS Jagan అమెరికాలో కేసు.. దేశాన్ని ఊపేస్తున్న వ్యవహారం.. అపోజిషన్‌ నేతను టార్గెట్‌ చేస్తున్న తీరుతో.. సోలార్‌ పవర్ కొనుగోళ్ల కేసు ఓవర్‌ టు ఏపీ అయిపోయింది. దేశం మొత్తం అదానీ సెంట్రిక్‌గా చర్చ జరుగుతుంటే ఏపీలో మాత్రం జగన్‌ను కార్నర్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశాలను పరిశీలిస్తోందట రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్‌ కొనుగోలు అగ్రిమెంట్‌ వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ కమిషన్‌ గౌతమ్‌ అదానీతో పాటు ఆయన సన్నిహితులపై కేసు పెట్టింది.2021లో ఏపీ ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్‌ను కొనడానికి రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని..ఈ వ్యవహారంలో అప్పటి ఏపీ సీఎం ఉన్నారని ప్రస్తావించారు. దీని ఆధారంగా జగన్‌పై అవినీతి నిరోధక…

Read More

MLC Jayamangala Venkataramana | వైసీపీలో జంపింగ్స్ ఆగేదెన్నడు | Eeroju news

వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా

వైసీపీలో జంపింగ్స్ ఆగేదెన్నడు విజయవాడ, నవంబర్ 27, (న్యూస్ పల్స్) MLC Jayamangala Venkataramana   ఎన్నికల్లో పరాజయం తర్వాత ఏ పార్టీకి అయినా సమస్యలు వస్తాయి. కొంత మంది నేతలు వెళ్లిపోతారు. అయితే వారికి భవిష్యత్ పై ఆశలు కల్పించి పార్టీ మారకుండా చేసుకునేలా ఆ పార్టీ పెద్దలు ప్రయత్నించాల్సి ఉంది. వైఎస్ఆర్‌సీపీకి ఎమ్మెల్సీలు వరుసగా రాజీనామా చేస్తున్నా వారికి సర్ది చెప్పేందుకు పెద్దగా ఎవరూ ప్రయత్నించడం లేదు. ఏరి కోరి పార్టీలోకి తీసుకు వచ్చిన నేతలు కూడా పదవులకు కూడా రాజీనామాలు చేసి వెళ్తున్నారు. ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వలసలు ఉంటాయని భావిస్తున్నారు. వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఆయనను టీడీపీ నుంచి ప్రత్యేకంగా పదవి ఆఫర్ చేసి మరీ వైసీపీలో చేర్చుకున్నారు. తీరా…

Read More

Revenue Sadassulu in AP | డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు | Eeroju news

డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు

డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు విజయవాడ, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Revenue Sadassulu in AP భూముల రీసర్వే సమస్యల పరిష్కారానికి ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామ సభల్లో స్వీకరించిన ఫిర్యాదులను 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.వైసీపీ హయాంలో ఏపీలో భూముల రీసర్వే జరిగింది. దీంతో పాత సమస్యలతో పాటు కొన్ని కొత్త సమస్యలు తలెత్తాయి. భూరికార్డుల ప్రక్షాళన పేరిట చేపట్టిన రీసర్వే ఇంకా పూర్తికాలేదు. ఇంతలో ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో భూముల రీసర్వే దాదాపుగా నిలిచిపోయింది. భూసమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.భూముల సమస్యల పరిష్కారించేందుకు డిసెంబర్ 1వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గ్రామ,…

Read More

Cable war in AP…| బెజవాడలో కేబుల్ వార్… | Eeroju news

బెజవాడలో కేబుల్ వార్...

బెజవాడలో కేబుల్ వార్… విజయవాడ, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Cable war in AP పీలో కేబుల్‌ వార్‌ నడుస్తోంది. కేబుల్ వ్యాపారంలో గుత్తాధిపత్యం కొనసాగిస్తున్న సంస్థలు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కేబుల్ వ్యాపారాన్ని దక్కించుకునేందుకు కొందరు పావులు కదిపారు. కోట్లు కురిపించే కేబుల్ వ్యాపారంలో కొందరికి మాత్రమే లాభాలు దక్కుతున్నాయని, కళ్లు చెదిరే ఆదాయం కేబుల్‌ వ్యాపారంలో లభిస్తోందని గుర్తించిన రాజకీయ నేతలు తమ పరిధిలో కేబుల్ వ్యాపారాన్ని దక్కించుకోడానికి పావులు కదిపారు. ఈ క్రమంలో కొందరు రాజకీయ నాయకులకు ముఖ్యనాయకుల ఆశీస్సులు లభించడంతో విజయవాడలో కేబుల్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవడం సులువైంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న టీవీ ఛానళ్ల ప్రసారాలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ సానుభూతిపరులు…

Read More

Pawan Kalyan | పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్ | Eeroju news

పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్

పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్ విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Pawan Kalyan మహారాష్ట్ర ఎన్నికల్లో మహా యూటీ కూటమి ఘనవిజయం సాధించింది. బిజెపి నేతృత్వంలోని ఆ కూటమి 230 సీట్లు సాధించి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. బిజెపి సొంతంగా 132 సీట్లు గెలుచుకోగా..శివసేన 57 స్థానాలు..ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం చవిచూసింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన 20 చోట్ల, కాంగ్రెస్ 16 చోట్ల, శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సిపి పది చోట్ల విజయం సాధించాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కేకే సర్వే అంచనాలు నిజమయ్యాయి. ఆ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా నిలిచాయి. ఈ సంస్థ అధినేత కిరణ్ కొండేటి ఆసక్తికర విషయాలను…

Read More

Social war in AP | మళ్లీ మొదలైన సోషల్ మీడియా వార్ | Eeroju news

మళ్లీ మొదలైన సోషల్ మీడియా వార్

మళ్లీ మొదలైన సోషల్ మీడియా వార్ విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Social war in AP నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా యుగం ప్రారంభమయింది. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానున్న కాలంలో మరింత వేడెక్కనున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఎవరూ ఎవరికీ తగ్గని పరిస్థితుల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలను ఇప్పటికే ఏపీలో ప్రారంభించాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఏ అంశం పై సోషల్ మీడియాలో పోస్టు చేస్తారో? ఎవరిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడతారన్నది రాజకీయ నేతలకు…

Read More

Amaravati | అమరావతి రైతుల కోసం 9 రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు | Eeroju news

అమరావతి రైతుల కోసం 9 రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు

అమరావతి రైతుల కోసం 9 రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి నిర్మాణం కోసం చాలామంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇది శుభ పరిణామమని ఏపీ సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ మల్లారపు నవీన్‌ వ్యాఖ్యానించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు శుభవార్త చెప్పారు. వారికి కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నవీన్ వెల్లడించారు.తాజాగా.. గవర్నర్‌పేటలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో గతంలో రిటర్నబుల్‌ ప్లాట్లు అందుకోని రైతులకు.. లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. రిటర్నబుల్‌ ప్లాట్లు పొందిన రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 9 రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. లాటరీలో ప్లాట్లు పొంది ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు అందుకున్న రైతులు వారం లోపు సంబంధిత కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లాటరీకి…

Read More

YS Jagan.. Adani | జగన్ కు ఆదానీ దెబ్బ,,,, | Eeroju news

జగన్ కు ఆదానీ దెబ్బ,,,,

జగన్ కు ఆదానీ దెబ్బ,,,, విజయవాడ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) YS Jagan.. Adani దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి సంబంధించిన ఓ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఓ భారీ డీల్ కుదుర్చుకునేందుకు.. ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్- ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది.ఈ వివాదాస్పద వ్యవహారం క్రమంగా.. ఆంధ్రప్రదేశ్ గత సర్కార్ కు చుట్టుకుంటోంది. 2019- 2024 మధ్య అధికారంలోని ప్రభుత్వంతో గౌతమ్ అదానీ.. ఈ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నడిపినట్లు ఆమెరికా విచారణ సంస్థ ఎఫ్‌బీఐ పరిశోధనలో వెల్లడైంది. ఇందుకోసం.. దాదాపు రూ.1,750 కోట్లు చేతులు మారినట్లు అమెరికా విచారణ సంస్థ.. ఆ దేశ కోర్టుకు సమర్పించిన ఫైలింగ్…

Read More

AP News | పీఏసీ పదవి దూరమేనా | Eeroju news

పీఏసీ పదవి దూరమేనా

పీఏసీ పదవి దూరమేనా విజయవాడ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) AP News ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పీఏసీ చైర్మన్ ఎంపిక సైతం వైసీపీకి కలిసివచ్చినట్లు కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం చతికిల పడాల్సి వచ్చింది. దీంతో కేవలం 11 అంటే 11 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం కావలసి వచ్చింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో శాసనసభలో కనీసం ప్రతిపక్ష హోదా లేదన్న విమర్శలను మూటకట్టుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.అయితే ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే కనీసమైన సభ్యుల సంఖ్య ఉండాలన్న నిబంధనలు చెబుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టును సైతం ఆశ్రయించింది. అయితే అనూహ్యంగా సభలో కీలకమైన…

Read More

Chandrababu | పీపీపీ మోడల్ లో అభివృద్ది పనులు | Eeroju news

పీపీపీ మోడల్ లో అభివృద్ది పనులు

పీపీపీ మోడల్ లో అభివృద్ది పనులు విజయవాడ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Chandrababu తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పబ్లిక్,ప్రైవేటు పార్టనర్ షిప్ గురించి ఇటీవలి కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ మోడల్ కొన్ని విభాగాల్లో అమలు చేస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు ఏపీలో అభివృద్ధి పనులకు ఈ మోడల్ అనుసరించాలనుకుంటున్నారు. అంటే రోడ్లను ప్రైవేటు కంపెనీలతో వేయిస్తారు. ప్రజల నుంచి టోల్ వసూలు చేస్తారు. ఇప్పటి వరకూ జాతీయ రహదారుల్లో ఈ విధానం ఉంది. ఇప్పుడు రాష్ట్ర రహదారులకూ తీసుకు వస్తారు. అలాగే గోదావరి నీటిని బనకచర్ల వరకూ తీసుకెళ్లేందుకూ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు రూ. 70వేల కోట్లు ఖర్చవుతాయి. అంటే ఆ డబ్బులూ ప్రజలు కట్టాల్సిందే. జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోడ్ల నిర్వహణను అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి…

Read More