Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీడీపీ ర్యాలీ.

0

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం 100 రోజుల పాదయాత్రకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి వాకలపూడి అంబేద్కర్ విగ్రహం వరకు సంఘీబావయాత్ర సాగింది. ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగన్ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా లోకేష్ యువగళం యాత్ర చేపట్టారన్నారు.

 

యువగళం పాదయాత్ర 100 రోజుల్లో 1250 కిలోమీటర్ల పూర్తి చేసుకుందని తెలిపారు. లోకేష్ పాదయాత్రకి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించిందని.. అన్నింటినీ అధిగమించి పాదయాత్ర విజయవంతంగా సాగిస్తున్నారన్నారు. జగన్ పాదయాత్రలో కోర్టులకు వెళ్ళటానికి వారానికి రెండు సెలవులు పెట్టేవారని అన్నారు. లోకేష్ యాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలతో మమేకమవుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఒక్క చాన్సు అంటూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. యువతకు ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు.

 

పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారే తప్ప ఒక్క పరిశ్రమైనా స్థాపించారా అంటూ ప్రశ్నించారు. రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మద్యం, ఇసుక వంటి వాటిలో అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం వెనుక ఆ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. మన రాష్ట్రంలో కూడా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత అదే స్థాయిలో ఉంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా.. టీడీపీ విజయం ఖాయం.

నేత్రదానంకు ముందుకు వచ్చిన ఆదర్శ దంపతులు. అభినందించిన డాక్టర్ లక్ష్మీప్రసాద్.

ఈ నేపథ్యంలో పార్టీశ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ప్రజలు జగన్ పాలనను ముగింపు పలకటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈనెల 27,28 తేదీల్లో రాజమండ్రిలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు నిర్ణయించిన మహానాడును విజయవంతం చేయాలని కోరారు. జీవో 1ను హైకోర్టు కొట్టేయడం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి వెంకటరాజు బోళ్ల.కృష్ణ మోహన్ మట్ట ప్రకాష్ గౌడ్ బుంగ.సింహాద్రి గుల్లిపల్లి శ్రీనివాస్ తాతపూడి రామకృష్ణ కోటగిరి మహేంద్ర కాళ్ళ శ్రీను కాకినాడ రూరల్ నియోజకవర్గం అన్ని గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie