Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాకర్ల కోసం నారా రోహిత్ ప్రచారం…

0

నెల్లూరు: నెల్లూరు జిల్లా జలదంకి చిన్నక్రాక గ్రామంలో  ఎన్డీఏ కూటమి పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి అభ్యర్థి కాకర్ల సురేష్ తరపున నారా రోహిత్ ప్రచారం నిర్వహించారు. చిన్నక్రాకలో వేమిరెడ్డి కాకర్లలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చిన్నక్రాక తాగునీటి అవసరాలను  తీరుస్తామంటూ నేతలు హామీ ఇచ్చారు.  అనంతరం జలదంకిలో జరిగిన నారా రోహిత్  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకర్ల సురేష్ రోడ్ షో కి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. సోమశిల జలాశయం చిట్టచివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే బాధ్యత ప్రతి గ్రామంలో సురక్షితమైన మంచినీరు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే  బాధ్యత తీసుకుంటామంటూ నేతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie