Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జీవన్ రెడ్డి గెలుపు కోసం 16వ వార్డులో ఇంటింటా ప్రచారం…..

0

కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ  జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు బుధవారం కోరుట్ల పట్టణంలోని 16వ వార్డులో వార్డు కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి ల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, చేతి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. మిగిలిన హామీలు కూడా ఎన్నికల తర్వాత కచ్చితంగా అమలు చేస్తారని అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దేశంలో అందరికి సమన్యాయం జరిగిందని తెలిపారు .పార్లమెంట్ ఎన్నికల్లో  జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపి రేవంత్ రెడ్డి ,రాహుల్ గాంధీ లకు బహుమతిగా ఇద్దామని ప్రజలను కోరారు . బిజెపి 10 సంవత్సరాల కాలంలో సామాన్యులకు ఇలాంటి సంక్షేమాన్ని అందించలేద ని ఆవేదన వ్యక్తం చేశారు . బడా బాబులకు లక్షలాది కోట్ల రుణమాఫీ మోడీ ప్రభుత్వం చేసిందని అన్నారు . మతాల మధ్య చిచ్చుపెట్టి బిజెపికి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గద్దినేకించాలని కోరారు .ఈ ప్రచారంలో చిట్యాల సందీప్, గురువంతుల సత్తయ్య, ఉయ్యాల శేఖర్, మైస నవీన్, ఉయ్యాల శోభన్  తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie