ముమ్ముడివరం
ముమ్మిడివరం మండలం కమిని పంచాయితీ పరిధిలోని సలాదివారి పాలెం, పొట్టితిప్ప గ్రామాలలో కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) ఆద్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. బుచ్చిబాబుకు ప్రజలు అడుగడుగనా ఘనస్వాగతం పలికారు. మహిళల ఆయనపై పూలవర్షం కురిపించి, మంగళ హారతులతో నీరాజనం పలికారు.ఈ సందర్భంగా సలాది వెంకట స్వామి, చిన్నం మురళి నాయకత్వంలో తాడి నరసింహారావు, తాడి జానికీరామ్ ఆధ్వర్యంలో బుచి బాబు, గుద్దటి జమి, గోదశి పుండేరీష్ సమక్షంలో సలాదివారిపాలెం, పొట్టితిప్ప గ్రామాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు వైసీపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు…
Prev Post