Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రజలు ఇచ్చిన తీర్పును సిరసావిస్తున్నా: మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డి

ప్రజల సహకారంతోటి నియోజకవర్గం గ్రామాల అభివృద్ధి చేశా సీఎం కేసీఆర్ ఆలోచనలతో సంక్షేమం అభివృద్ధి పథకాల ఫలాలు అందించాం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధైర్య పడవద్దు  ఆరు గ్యారెంటీల అమలకు సహకరిస్తాం, లేకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డి

0

పెద్దపల్లి
ప్రజలు ఇచ్చిన తీర్పును సిరసావిస్తున్నానని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఓదెల జడ్పిటీసి గంట రాములుతో కలి ఆయన మాట్లాడుతూ ప్రజల సహకారంతో నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం పథకాల ఫలాలు అందించామన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధైర్య పడవద్దని, ఆరు గ్యారెంటీల అమలకు సహకరిస్తామన్నారు. లేకుంటే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామన్నారు. ఉన్మాదంతో కూడిన రాజకీయాలు చేస్తే వినాశనానికి దారితీస్తాయని అన్నారు. ఉన్మాదంతో కూడిన రాజకీయాలు వినాశనానికి దారితీస్తాయని, అలాంటి రాజకీయాలు చేయడం రాజకీయ నాయకులకు తగదని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డి అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా తనకు రెండుసార్లు అవకాశమిచ్చిన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ప్రేమను మరిచిపోలేనని తెలిపారు. పదేళ్ళుగా తనవెంట నడిచిన కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులకు, ప్రజలకు దన్యవాదములు తెలిపారు. నియోజకవర్గంలో రూ.కోట్ల ఖర్చుతో అభివృద్ది, సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్న ఆయన, పెద్దపల్లి పట్టణాన్ని మునిసిపాలిటీగా, ఆ తర్వాత జిల్లా కేంద్రంగా మార్చడంలో విశేషంగా కృషి చేయడం జరిగిందన్నారు.

అభివృద్ధి సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం : అన్నం అనిల్

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్స్, సిఎంఆర్ఎఫ్, ఎల్ఓసి, రైతుబందు, మిషన్ భగీరథ వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేసి, వేల సంఖ్యలో ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించినట్లు వివరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, కార్యకర్తలు, అభిమానులు అదైర్యపడవద్దని, కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరిపేలా తమ పనితీరు ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలవగానే నియోజకవర్గంలో బెదిరింపుల పర్వం మొదలయ్యిందన్న ఆయన, పెద్దపల్లి, సుల్తానాబాద్ లలో కార్యకర్తలపై మూకుమ్మడి దాడులకు పాలపడటం దారుణమన్నారు. కార్యకర్తల ఆస్తులపీ దాడులు చేసి నష్టరచడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్యే విజయరమణారావు ఆదేశాలతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అంతమాత్రాన పేద కార్యకర్తలపై దాడులు చేయడం పిరికిపందల చర్య అని పేర్కొన్నారు. గెలుపు హుందాతనాన్ని ఇస్తుందని, కానీ ఉన్మాదంతో ఊగిపోవడం కాంగ్రెస్ పార్టీ నైజమా అని ప్రశ్నించారు. వ్యవస్థలను గౌరవించలేని వ్యక్తుల సంస్కారంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు తుదివరకు అండగా ఉంటానని, ఎవరూ అదైర్య పడవద్దని వారికి భరోస కల్పించారు. ఈ సమావేషంలో పెద్దపల్లి మునిస్పల్ చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్, సుల్తానాబాద్ ఎంపిపి బాలాజీ రావు, మునిసిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie