Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైకాపా ప్రభుత్వంకి మద్దతు ఇచ్చి వైస్సార్సీపీ అభ్యర్థులని గెలిపించండి….

- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు దగ్గర మహిళలను కోరిన పైలా,చుక్కా

0


పరవాడ: మండల కేంద్రమైన మేజర్ పంచాయతీ పరవాడ గ్రామం లో వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు ఎన్ఆర్ఈజిఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం వాళ్ల పని వద్దకు వెళ్లి పాల్గొని వారితో కలిసి అల్పాహార విందు చేసి సార్వత్రిక
ఎన్నికల్లో భాగంగా వైకాపా రాష్ట్ర సిఈసి సభ్యులు పైల శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు ఆధ్వర్యంలో ప్రచారం లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళలు తమకు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం లో ఎంతో మేలు జరిగిందని, మహిళలు కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రతి సంక్షేమ పథకాలు మా మహిళల ఖాతాలు లో వేస్తున్నారని చెప్పుకొచ్చారు. పెందుర్తి వై.ఎస్.ఆర్.సి.పి అసెంబ్లీ అభ్యర్థి గా అన్నంరెడ్డి అదీప్ రాజ్ ను, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న  బూడి ముత్యాల నాయుడుని మే 13 న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఓటును ఫ్యాన్ గుర్తు పై వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వైయస్సార్ పార్టీ అని, ప్రతి పేదవాడికి అనునిత్యం పథకాలు అందించి ఆదుకుంటున్న ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వం. మీ కుటుంబంలో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని అభ్యర్థించిన ఏకైక నాయకుడు మన జగనన్న అని ఈసారి కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజ్ గెలిపించి జగనన్నకు 
గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు. సమస్యలు ఉంటే అదీప్ రాజ్ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకు వెళుతుంటే జగన్మోహన్ రెడ్డి దయవల్ల మాకు చాలా పథకాలు వచ్చాయంటూ లబ్ధి దారులు ఎదురు వచ్చి చెప్పడం ఎంతో ఆనందం ఇస్తోందని అన్నారు., ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు, మండల జేసీస్ కన్వీనర్ వెన్నెల సన్యాసిరావు, పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, పరవాడ వార్డు మెంబెర్ లు పైల హరీష్, పైల వెంకటరావు, వర్రీ రమేష్, చుక్క వెంకట లక్ష్మీ, వైస్సార్టుక్ జనరల్ సెక్రెటరీ పైల పైడం నాయుడు, పైల ఈశ్వరరావు, పైల అప్పారావు, చీపురుపల్లి శ్రీనివాసరావు, పైల ప్రసాద్, చుక్క శివ, బొంకులదిబ్బ యూత్ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie