సంక్షిప్త వార్తలు:04-22-2025:గంభీరావుపేటలో రైతులు దారికి అడ్డంగా ధాన్యం బస్తాలు వేసి ఆందోళనకు దిగారు. ధాన్యం సరిగా కొనుగోలు చేయడం లేదని… కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని నిరసనకు దిగారు. ధాన్యం బస్తాలు, ధాన్యం రోడ్డుపై పోసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేసారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసారుఎ. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెలరోజులవుతున్న కొనుగోలు చేసిన 2వేల బస్తాల ధాన్యం వర్షానికి తడిసిందనిమండిపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన ధాన్యం రైతులు
సిరిసిల్ల
గంభీరావుపేటలో రైతులు దారికి అడ్డంగా ధాన్యం బస్తాలు వేసి ఆందోళనకు దిగారు. ధాన్యం సరిగా కొనుగోలు చేయడం లేదని… కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని నిరసనకు దిగారు. ధాన్యం బస్తాలు, ధాన్యం రోడ్డుపై పోసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేసారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసారుఎ. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెలరోజులవుతున్న కొనుగోలు చేసిన 2వేల బస్తాల ధాన్యం వర్షానికి తడిసిందనిమండిపడ్డారు. ధాన్యం తడిస్తే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు.
ధాన్యం తడిస్తే సంచికి 10 కిలోలు కట్ చేస్తారని ఆ నష్టం రైతు ఎందుకు భరించాలని ఆందోళన చేసారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేసి సత్వరమే తరలించాలని డిమాండ్ చేసారు. పోలీసుల జోక్యంతో రైతులు ఆందోళన విరమించారు. ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోని విద్యుత్ అధికారులు
ఏదైనా ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా

పలుమార్లు విన్నవించుకున్న విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదని కంప్లైంట్ పై అధికారులకు ఫిర్యాదు చేసిన మేము కంప్లైంట్ తీసుకుంటున్నామని ఐడి నెంబర్ ఇచ్చారు. Id 2501130119 ఏఐ అధికారులకు పలుమార్లు చెప్పిన ప్రయోజనం లేకపోయిందని కాలనీవాసులు వాపోతున్నారు.వివరాలకు వెళితే కుంటానహల్ గ్రామం లో ఉర్దూ స్కూల్ బావి దగ్గర ఎర్త్ వైర్ గాలివానలకు పలుమార్లు విద్యుత్ వైర్లు తెగిపోతున్నాయని శాశ్వత పరిహారం చూపమని ఎన్నోసార్లు పలుమార్లు విన్నవించిన అధికారులు మాత్రం వచ్చి అదే వైరిని తగిలించి ప్యాచ్ అంటించి వెళ్తున్నారే గాని కొత్త వైర్లు వేయడానికి సంకోచించడం లేదని.
కనీసం ఎర్త్ వైర్ కు నీళ్ళు కూడా పోయడం లేదని ఏ క్షణాన ఏమవుతుందని భయంతో బిక్కుబిక్కుమంటున్నామని కాలనివాసులు వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపుతారని .సదకాలి. జాకిర్. మొహమ్మద్ sab. ఇసుఫ్. శర్మస్ వాలి. షేక్షవాలి అబ్దుల్లా కోరుచున్నారు.
మెగా డీఎస్సీ పేరుతో జగన్ యువతకు మోసం చేశారు
బద్వేలు నియోజకవర్గ కూటమి నాయకుడు సూర్యనారాయణ రెడ్డి

వైసీపీ హయాంలో మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగ యువతను మాజీ సీఎం జగన్ మోసం చేశారని బద్వేలు నియోజకవర్గ. కూటమి నాయకుడు ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి అన్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు డీఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం చేసి నిరుద్యోగులకు న్యాయం చేశారన్నారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 6 వేలు డీఎస్సీ ఇస్తానని నమ్మించి మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట ప్రకారం 16 వేల డీఎస్సీ పోస్టులను విడుదల చేశామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలలలోనే ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేసి పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. పాస్టర్లకు ఐదు వేలు, ఆర్పిలకు 10 వేలు జీతం పెంచడం జరిగిందని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని దాన్ని సరిదిద్దుతూ సంక్షేమం అభివృద్ధిని కొనసాగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో డీఎస్సీ పోస్ట్లు అత్యధిక రావడం సంతోషకరమన్నారు._
వైభవంగా విగ్రహం ప్రతిష్ట మహోత్సవం
![]()
బద్వేలు పట్టణం మైదుకూరు రోడ్డు లోని శ్రీ కన్యకా పరమేశ్వరి షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణంలో సోమవారం నుండి గురువారం వరకు వైభవంగా శ్రీ తెస్తాలే కార్య సిద్ధి వినాయక స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమాన్ని శ్రీరామ కవచం శివరామకృష్ణ శర్మ రాయి పెద్ది సుబ్బరామ శర్మ బోయలకుంట్ల సుబ్బ నరసయ్య స్వామి, ప్రభాకరయ్య స్వామి, అన్నదానం సుబ్రహ్మణ్యం శర్మ, కృష్ణ పార్టీ లక్ష్మీనారాయణ శాస్త్రి ఎస్ చరణ్ శర్మ ఆధ్వర్యంలో విగ్ర ప్రతిష్ట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది*
స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఆర్యవైశ్య ప్రముఖులు యాదాల కృష్ణమూర్తి, పెద్ది శెట్టి పిండి లక్ష్మయ్య, కొలిశెట్టి రమేష్, ప్రిన్సిపాల్ చిన్ని బసవయ్య, పరిటాల వెంకటసుబ్బయ్య, సముద్రాల రఘురామయ్య,వి, వి , రమణ తో పాటు పలువురు ప్రముఖులు, వ్యాపారస్తులు విగ్ర ప్రతిష్ట మహోత్సవంలో స్వామివారిని దర్శించుకున్నారు, వారికి ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కే,వీ సుబ్బారావు సెక్రటరీ కొలిశెట్టి నాగరాజ,తో పాటు పలువురు కమిటీ సభ్యులు పలువురికి ప్రత్యేక తీర్థప్రసాదాలను అందజేశారు
