సంక్షిప్త వార్తలు:04-28-2025:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ… నిన్నటి సభ కేవలం అధికార దాహం కోసమే అన్నారు. కెసిఆర్ మాటల్లో అబద్దాలు తప్ప ఏమి లేవన్నారు. తెలంగాణ ఉద్యమం సమయం లో చెప్పిన మాటలన్నీ గాలికొదిలేసిన ఘనత కెసిఆర్ ది అన్నారు.
అధికార దాహం కోసమే నిన్నటి సభ..
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ… నిన్నటి సభ కేవలం అధికార దాహం కోసమే అన్నారు. కెసిఆర్ మాటల్లో అబద్దాలు తప్ప ఏమి లేవన్నారు. తెలంగాణ ఉద్యమం సమయం లో చెప్పిన మాటలన్నీ గాలికొదిలేసిన ఘనత కెసిఆర్ ది అన్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. బి ఆర్ ఎస్ పదేళ్ల పాలనలో చెప్పిన హామీలేవి నెరవేరాలేదన్నారు. పదేళ్లలో వంద అబద్దాలు ఆడారన్నారు. దళిత సీఎం, 3 ఎకరాలు, నిరుద్యోగ భృతి ఇలా ఎన్నో హామీలు గాలికొదిలారు కాబట్టే ప్రజలు అధికారం దూరం చేశారన్నారు. తెలంగాణ లో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలు నీళ్లిస్తామన్నారు. దక్షిణ తెలంగాణ ను గాలికొదిలేసారన్నారు. లక్ష్మి దేవి పల్లి రిజర్వాయర్ ను రెండేళ్లలో పూర్తి చేస్తామని పదేళ్లు పాలించినా, 30% కూడా పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం కేవలం కలక్షన్ల కోసమే అన్నారు.
పాతబస్తిలో ఈడీ సోదాలు
![]()
హైదరాబాద్
నగరంలో మరోసారి ఈడీ సోదాలు జరిగాయి. సోమవారం ఉదయం భూదాన్ ల్యాండ్ వ్యవహారం లో ఈడి సోదాలు జరిగాయి. మహేశ్వరం ల్యాండ్ విషయం లో సోదాలు జరిపారు. భూధాన్ ల్యాండ్ ను అక్రమం గా లే అవుట్ చేసి మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా అమ్మకాలు చేసినట్లు గుర్తించారు. పాత బస్తీ లో మున్వర్ ఖాన్ , ఖదీర్ ఉన్నిసా, షర్ఫాన్, షూకుర్ ఇంట్లో ఈ డీ సోదాలు చేసింది. గతంలో ఇదే కేసులో ఐఏఎస్అధికారి అమయ్ కుమార్ నీ ఈడీ విచారణ చేసింది.
క్రిస్టీయన్ల శాంతి ర్యాలీ

కూకట్ పల్లి
కూకట్ పల్లిలో క్రిస్టియన్ మతస్తులు శాంతి ర్యాలీ జరిపారు. కూకట్ పల్లి, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని క్రిస్టియన్లు ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతి ర్యాలీ కోసం పదిసార్లు పర్మిషన్లు అడిగిన పోలీసులు ఇవ్వలేదు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో శాంతి ర్యాలీ నిర్వహించాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మహత్య కాదు హత్యాచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాస్టర్ ని హత్య చేసిన దానిపైన నోరు మెదపడం లేదు. రేవంత్ రెడ్డి సర్కారులో క్రిస్టియన్ మతస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఒక పాస్టర్ ని హత్య చేసిన దానిపైన పోలీసులు కానీ ప్రభుత్వంగానే మాట్లాడడం లేదని ఆరోపించారు.
డబల్ బెడ్ రూముల్లో అధికారుల తనిఖీలు
కంటోన్మెంట్..

మారేడుపల్లి లోని రెండు పడక గదుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.రెండు పడక గదుల ఇళ్లలో అక్రమంగా కొంతమంది ఉన్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ జరుపుతున్నారు.రెండు పడక గదుల ఇళ్లలోకి వెళ్లకుండా బారికేడ్లను వేసిన పోలీసులు లోపలికి వెళ్లేందుకు ఎవరికి అనుమతించట్లేదు. మారేడుపల్లి లో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను అక్రమంగా కొంతమంది చేసుకొని అందులో నివాసం ఉంటున్నట్లు ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పోలీసుల సహాయంతో వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అక్రమంగా ఉండే వారిపై చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.
లిఫ్టు లో దారుణ హత్య

హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిఫ్ట్ లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి లిఫ్ట్ లో పడివేసి వెళ్లిపోయారు. దోమలగూడా పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి హత్యకు గల కారణాలు సేకరిస్తున్నారు.
