సంక్షిప్త వార్తలు:04-28-2025:రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కార్లు ఫల్టీలు కొట్టి ఒకదానిపై ఒకటి పడ్డాయి. మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. ఒక డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.
పీవీ ఎక్స్ ప్రెస్ వే లో ఢీకొన్న కార్లు
రంగారెడ్డి
రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కార్లు ఫల్టీలు కొట్టి ఒకదానిపై ఒకటి పడ్డాయి. మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. ఒక డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.
పి ఎస్ ఆర్ ఆంజనేయులు కస్టడీ తీసుకున్న సిఐడి
విజయవాడ
ఐసీఎస్ అధికారి పిఎస్సార్ అంజనేయులును సిఐడి అధికారులు కస్టడిలోకి తీసుక్ఉన్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీ తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు లాయర్ సమక్షంలో విచారణకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు అనంతరం విచారించారు
లోకాయుక్తా, ఉప లోకాయుక్తా ప్రమాణ స్వీకారం

హైదరాబాద్
రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర లోకయుక్త ఉప లోకాయుక్త పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యాతిదిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పాల్గొని నూతనంగా లోకయుక్తగా నియమితులైన జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డి. ఉప లోకాయుక్త జస్టిస్ బి ఎస్ జగ్జీవన్ కుమార్. తో( నేడే సోమవారం) ప్రమాణ స్వీకారం చేయించారు. చిత్రంలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభపతి గడ్డం ప్రసాద్ కుమార్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు. మహమ్మద్ అలీ షబ్బీర్. వేము నరేందర్ రెడ్డి. మంత్రులు. శాసన సభ్యులు. శాసన మండలి సభ్యులు. తదితరులు ఉన్నారు
కెసిఆర్ విమర్శలు ఇప్పుడుకాదు అసెంబ్లీకి వచ్చి చేయాలి
సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్
కేసీఆర్ చేసిన విధ్వంసంతోనే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు నేను వెళ్లి పరామర్శించా. ఎవరూ చావును కోరుకోరు కదా రేవంత్. నేను ఇంకా 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుక పడ్డాం. స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్లైన్ చేశామని అన్నారు. కేసీఆర్ లా పథకాలను లాంచ్ చేసి వదిలేయను. కేసీఆర్వి అన్నీ శాంపిల్ పథకాలు. అరెస్టుల విషయంలో తొందర పడితే ఏపీలో ఏం జరిగిందో చూశాం కదా అని అన్నారు.
