సంక్షిప్త వార్తలు:04-29-2025

brief news

సంక్షిప్త వార్తలు:04-29-2025:ఇబ్రహీంపట్నం లోని ఎమ్. వి. ఆర్ హాల్ లో మైలవరం నియోజకవర్గం ఎన్. డి. యే కూటమి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం  జరిగింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి వస్తున్నన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని తీర్మానం చేసారు. కృష్ణ నది పై నూతనంగా నిర్మించిన గొల్లపూడి  వంతెన పై మే 2వ తేదీ వాహనాలకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు.

మోడీ సభను విజయవంతం చేయాలి

మైలవరం
ఇబ్రహీంపట్నం లోని ఎమ్. వి. ఆర్ హాల్ లో మైలవరం నియోజకవర్గం ఎన్. డి. యే కూటమి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం  జరిగింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి వస్తున్నన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని తీర్మానం చేసారు.
కృష్ణ నది పై నూతనంగా నిర్మించిన గొల్లపూడి  వంతెన పై మే 2వ తేదీ వాహనాలకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు.

అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉన్న మైలవరం నియోజకవర్గం నుంచి ప్రజలు ప్రధాన మంత్రి మోడీ కి స్వాగతం పలికెందుకు స్వచ్ఛందంగా  వేలాదిగా రానున్న ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు  ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. గత ఐదేళ్లలో జగన్  అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఆపివేసి రాష్ట్ర అభివృద్ధి అడ్డుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ముఖ్య మంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం తో రాష్ట్ర అభివృద్ధి దిశగా పయనిస్తుందని అయన అన్నారు.

రీల్స్ కోసం వచ్చి నీటి క్వారీలో పడి  యువకుడు మృతి

Photo Shoot | ఫొటో షూట్‌ కోసం వెళ్లి.. క్వారీ గుంతలో పడ్డాడు-Namasthe  Telangana

మేడ్చల్
జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం అటవీ ప్రాంతంలో గల నీటి క్వారీలో పడి తరుణ్ (17) మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా, కౌకూర్ భరత్ నగర్ కాలనీకి చెందిన ఆరుగురు యువకులు రిల్స్ చేయడానికి అని కెమెరా తీసుకొని జవహార్ నగర్ లోని అడవి ప్రాంతంలో గల ఒక క్వారీకి చేరారు. ఫోటోషూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటి క్వారీలో తరుణ్ పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. పోలీసులు ఘటన  స్థలానికి చేరుకున్నారు.

ప్రభుత్వ వైద్య కాళాశాలకు తాళాలు

Medical Colleges: మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి |  nmc-allowed-to-establish-another-four-medical-colleges-in-telangana

రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు భారత్ కాలేజ్ యాజమాన్యం తాళం వేసింది.కళాశాల అద్దె చెల్లించకపోవడంతో కాలేజీ బోర్డ్ ను భారత్ కాలేజీ యాజమాన్యం తొలగించింది.  మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల కు కేటాయించాల్సిన భవనం సరైనా వసతులులేక ఇబ్బందులకు గురవుతున్నామని అధ్యాపకులు తెలిపారు.  ప్రభుత్వ వైద్య కళాశాల అద్దెను కాలేజ్ ప్రారంభం నుండి ఇవ్వకపోవడం వలనే కళాశాలకు తాళం వేసినట్లు భారత్ కాలేజ్ యాజమాన్యం వాదించింది.

Related posts

Leave a Comment