సంక్షిప్త వార్తలు:04-29-2025:రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో అత్యాధునికంగా నిర్మించిన క్షిపణి పరిశోధన కేంద్రాన్ని మే 2 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేపట్టవలసిన బందోబస్తు కార్యక్రమాలు ఇతర ఏర్పాట్లను గూర్చి జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ తో కలిసి సమీక్షించారు.
గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ గంగాధరరావు
విజయవాడ
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో అత్యాధునికంగా నిర్మించిన క్షిపణి పరిశోధన కేంద్రాన్ని మే 2 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేపట్టవలసిన బందోబస్తు కార్యక్రమాలు ఇతర ఏర్పాట్లను గూర్చి జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ తో కలిసి సమీక్షించారు.
వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నప్పటికీ ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే నేపథ్యంలో ఇక్కడే భద్రత ఏర్పాట్లు గూర్చి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. క్షిపణి పరిశోధనా కేంద్రాన్ని కృష్ణాజిల్లాలో ప్రారంభించడం దేశానికే తలమానికమని, కనుక ఈ కార్యక్రమాన్ని జిల్లాకు గర్వకారణంగా ఉండేలా అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఘటన
బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య

విశాఖపట్నం
జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఘటనలో ట్విస్ట్ నెలకొంది. బాలిక తల్లి, అమ్మమ్మ ఇద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల విచారణకు భయపడి ఆత్మహత్య చేసుకున్ఆరు. ఏప్రిల్ 25న గాలి సోకిందని జ్ఞానాపురం చర్చికి బాలికను తల్లి, అమ్మమ్మ తీసుకువచ్చారు. బాలిక పిచ్చి పట్టినట్లు కరుస్తుందని నోట్లో గుడ్డ కుక్కి, మూతికి బట్ట చుట్టారు. దాంతో ఊపిరి ఆడక బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే.
అంగరంగ వైభవంగా నడివీధి గంగమ్మ జాతర ఉత్సవాలు
నడివీధి గంగమ్మకు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్న తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష దంపతులు.
![]()
తిరుపతి
తిరుపతి 27వ డివిజన్ పరిధిలోని మల్లయ్య గుంట కట్ట నడివీధి గంగమ్మ తల్లి జాతర మూడవ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి యేటా జరిగే మల్లయ్య గుంటకట్ట నడివీధి గంగమ్మ జాతర ఆనవాయితీగా గ్రామ పెద్దలు నిర్వహించడం జరుగుతుందని గ్రామ పెద్దలు తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష దంపతులు వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, తాతయ్య గుంట గంగమ్మ గుడి ఆవరణం నుండి మేళతాళాలతో సారె అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రతి యేటా గంగ జాతర మూడో వారం ముందు జరిగే నడివీధి గంగమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు డాక్టర్ మునిశేఖర్, భరణి యాదవ్, తులసి యాదవ్, హేమంత్ కుమార్, చింతా రమేష్, మునిశేఖర్ రెడ్డి, భాష, సంధ్య, కృష్ణ, గజేంద్ర, శివ,బాలాజీ, గంగమ్మ భక్తులు పాల్గొన్నారు.
నార్త్ రాజుపాలెం లో జాతీయ రహదారిపై ప్రమాదం,ఇద్దరు యువకులు మృతి

నెల్లూరు
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం జాతీయరహదరిపై ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక ఐస్ ఫ్యాక్టరీ నుండి హైవే పైకి వస్తున్న లారీని వెనక వైపు ప్రమాదవశాత్తు నెల్లూరు నుండి బిట్రగుంటకు వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోగులు మండలం రామస్వామి పాలెం కు చెందిన ప్రవీణ్, ఇబ్రహీంపట్నం కు చెందిన మన్సూర్ ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. సమాచారం అందుకున్న కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు . మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
