Andhra Pradesh:ఈ స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మొత్తం 754 కోట్ల రూపాయల విలువచేసే బాండ్లు జారీ చేస్తే అందులో దాదాపు 691 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏలూరు జిల్లా వైసీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
కారుమూరి మెడకు 690 కోట్ల టీడీఆర్ స్కాం
ఏలూరు. ఏప్రిల్ 21
ఈ స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మొత్తం 754 కోట్ల రూపాయల విలువచేసే బాండ్లు జారీ చేస్తే అందులో దాదాపు 691 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏలూరు జిల్లా వైసీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ కూటమి ప్రభుత్వంతో పాటు మళ్ళీ పాత కేసులను బయటకు తోడేలా చేసేయంటూ టాక్ విన్పిస్తోంది.ఇటీవల ఎంపీపీ ఎన్నికల సమయంలో టిడిపి నాయకులు చేసిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో వైసిపిపై దాడులు చేస్తే మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు వరకు ఇంటి నుండి బయటకు లాగి కొడతామనీ, గుంటూరు తర్వాత నరికి చంపేస్తామని కారుమూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కూటమి నేతలంతా తీవ్రంగా స్పందించారు.
తణుకు నియోజవర్గంలో కొందరు టిడిపి నాయకులు కారుమూరి వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు.ఎప్పుడు సైలెంట్ గా ఉండే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సైతం కారుమూరి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసాపురంలో జరిగిన సభలో మాట్లాడుతూ…రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్న హెచ్చరించిన వర్మ…ఆ తర్వాత పాలకొల్లు నియోజకవర్గంలో జరిగిన సభలో మాత్రం కారుమూరిపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తల జోలికి వస్తే చేతులు, కాళ్లు నరికేస్తానంటూ కేంద్రమంత్రి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.ఎవరినైనా చంపడానికి చేతులు లేకుండా, నడవడానికి కాళ్లు లేకుండా చేస్తానంటూ కారుమూరిని హెచ్చరించారు. TDR బాండ్ల స్కాంలో వందల కోట్లు అవినీతి చేసిన కారుమూరి నాగేశ్వరరావు త్వరలో జైలుకెళ్లడం ఖాయం అన్నారు. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇక కారుమూరి నాగేశ్వరరావు జైలుకి వెళ్లడం తప్పుదంటూ రకరకాల టాక్స్ పొలిటికల్ సర్కిల్స్ లో విన్పిస్తున్నాయి.
నెక్స్ట్ లిస్టులో కారుమూరి పేరు ఉందంటూ ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారట.TDR బాండ్ల స్కాంలో వందల కోట్లు అవినీతికి కారుమూరి పాల్పడ్డారంటూ కేంద్ర మంత్రి వర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయి. టీడీఆర్ బాండ్ల స్కాంలో అసలేం జరిగిందంటూ ఇప్పుడు అంతా ఆరా తీస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారుమూరి..తన సొంత నియోజకవర్గమైన తణుకు పట్టణంలో అభివృద్ధి పేరుతో భారీ ఎత్తున సేకరించిన భూములపై ప్రస్తుత తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆరా తీస్తున్నారంట.తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల స్కాంపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. వాస్తవానికి 2014 నుండి 19 వరకు అప్పటి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు పట్టణ అభివృద్ధి కోసం 6వేల గజాలకు బాండ్లు ఇచ్చారు.
అయితే 2019 నుండి 24 వరకు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ఏకంగా 6 లక్షల గజాల వరకూ బాండ్లు ఇవ్వడంతో తీగలాగితే డొంక కదిలింది అన్నట్లు రాష్ట్రంలోనే భారీగా టీడీఆర్ బాండ్స్ స్కాం బయటపడేందుకు కారణమైందట.ఈ స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మొత్తం 754 కోట్ల రూపాయల విలువచేసే బాండ్లు జారీ చేస్తే అందులో దాదాపు 691 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే ఏసీబీ విచారణ పూర్తయిందని..త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉందట. అయితే ఏసీబీ నివేదికలో కారుమూరి అవినీతికి పాల్పడినట్లు రుజువైతే ఆయన జైలుకెళ్లడం తప్పదనే చర్చ జరుగుతోంది. అయితే ఏసీబీ సమర్పించే నివేదికలో ఏముందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
