సంక్షిప్త వార్తలు:05-08-2025:వరి సాగులో హైదరాబాద్ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. కరువును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించారు. ధన్ 100 వరి రకం 30శాతం అధిక దిగుబడినిస్తుందని రాజేంద్రనగర్ ఐఐఆర్‌ఆర్ తెలిపింది. ఈ పూసా రైస్ డీఎస్‌టీ1 గా చెప్పుకునే వరివంగడం కరువు, చౌడును తట్టుకుని నిలబడుతుంది. అన్నింటికంటే ఇది 20 రోజులు ముందే చేతికొస్తుందని, ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు.
నీళ్లు లేకుండా వరి
హైదరాబాద్, మే 8
వరి సాగులో హైదరాబాద్ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. కరువును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించారు. ధన్ 100 వరి రకం 30శాతం అధిక దిగుబడినిస్తుందని రాజేంద్రనగర్ ఐఐఆర్‌ఆర్ తెలిపింది. ఈ పూసా రైస్ డీఎస్‌టీ1 గా చెప్పుకునే వరివంగడం కరువు, చౌడును తట్టుకుని నిలబడుతుంది. అన్నింటికంటే ఇది 20 రోజులు ముందే చేతికొస్తుందని, ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు క్రిస్పర్–కాస్9 అనే జీనోమ్–ఎడిటింగ్ సాంకేతికతతో అభివృద్ధి చేసిన రెండు వరి వంగడాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే తొలి జన్యు సవరణ వరి రకంగా పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, భూతాపం తట్టుకుని అధిక దిగుబడిని ఇస్తుందని చెప్పారు. ‘దేశంలో ప్రజాదరణ పొందిన సాంబ మసూరి వంగడానికి జన్యుసవరణ చేసి ధన్ 100 (కమల)’ రకాన్ని అభివృద్ధి చేశాం. ‘క్రిస్పర్’ను వినియోగించి సాంబ మసూరిలోని సైటోకినిన్ ఆక్సిడేస్ జన్యువుకు సవరణ చేశాం. సుమారు 3 ఏళ్లు పట్టింది. 2 ఏళ్లు వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరీక్షలు చేశాం. ప్రస్తుతం మావద్ద ఈ రకానికి సంబంధించి మూల విత్తనాలు ఉన్నాయి. విత్తనాల విడుదలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. 19 శాతం పెరుగుదలతోపాటు 20 రోజుల ముందే పరిపక్వతకు వచ్చింది. ఈ వరి బలమైన కాండాలను కలిగివుండటంతో కరువును తట్టుకుని నిలబడుతుంది’ అని డాక్టర్ సతేంద్ర కుమార్ మంగ్రౌతియా స్పష్టం చేశారు.
ల్యాంగ్ మైన్ పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ములుగు
వాజేడు – పేరూరు అడవుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పోలీసులను టార్గెట్ చేసి మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. రోటీన్ కూంబింగ్ చేస్తున్న పోలీసుల పైకి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసారు. ఒక్కసారిగా పోలీసులపై కాల్పులు జరిపి ఐఈడీ పేల్చివేసారు. ఘటనలో రొటీన్ కూంబింగ్ కి వెళ్ళిన ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులు మృతి చెందారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముందుగా ల్యాండ్ మైన్ పేల్చిచ తరువాత తీవ్రంగా కాల్పులు జరిపారు మావోయిస్టులు. గాయపడ్డ పోలీసులను హాస్పిటల్ తరలించారు.
గొంతు కోసి మహిళ హత్య

హైదరాబాద్
చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేశవగిరి ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో నుండి మంటలు వస్తుండటం తో స్థానికులు 100 డయల్ చేసి మంటలను ఆర్పగా ఇంట్లో మహిళను గొంతు కోసి కాల్చిహత్య చేసినట్లు తెలిసింది. డివిజన్ నైట్ ఆఫీసర్ బండ్లగూడ ఇన్స్పెక్టర్ గురునాథ్ సంఘటన స్థలానికి చేరుకొన్నారు , సైబర్ క్రైమ్ డీసీపీ కవిత కూడా వచ్చి ఇది హత్య చేసి కాల్చినట్లుఅని నిర్ధారించారు. ఇంట్లో ఉన్న వస్తువులను వెదక గా ఆమె పేరు కేతవత్ బుజ్జి భర్త రూప్ల గా గుర్తించారు ఆమెకు ఒక కొడుకు అతను అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు మహిళ కూలి చేసుకొని బ్రతుకుతుంది అని తెలిసింది సంఘటన విషయం తెలుసుకొన్న చంద్రయాన్ గుట్ట ఇన్స్పెక్టర్ గోపి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు
మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి మృతి

హైదరాబాద్
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి గురువారం ఉదయం మరణించారు. అయన మృతి పట్ల మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. హబ్సిగూడ లోని నివాసానికి వెళ్లి రాజిరెడ్డి పార్దీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
