సంక్షిప్త వార్తలు:05-08-2025:ఆపరేషన్ సిందూర్ పై అనుచిత పోస్ట్ పెట్టిన శతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేపల్లి సుజాతను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ అధికారులకు బీజేపీ నేతలు పిర్యాదు చేసారు. దేశ భద్రతను, ఆర్మీనీ కించపరుస్తూ సోషల్ మీడియాలో సురేపల్లి సుజాత పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఆమెను తక్షణమే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని బీజేపీ మహిళ నేతల ఆందోళన.
సురేపల్లి సుజాతను అరెస్టు చేయాలి
కరీంనగర్
ఆపరేషన్ సిందూర్ పై అనుచిత పోస్ట్ పెట్టిన శతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేపల్లి సుజాతను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ అధికారులకు బీజేపీ నేతలు పిర్యాదు చేసారు. దేశ భద్రతను, ఆర్మీనీ కించపరుస్తూ సోషల్ మీడియాలో సురేపల్లి సుజాత పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఆమెను తక్షణమే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని బీజేపీ మహిళ నేతల ఆందోళన. శతవాహన యూనివర్సిటీ ముందు దిష్టి బొమ్మ దగ్ధం చేసారు. ..
2027లో పాదయాత్ర చేస్తా
వైఎస్ జగన్
విజయవాడ
2027లో తాను మళ్లీ పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, లోక్సభ నియోజకవర్గాల పర్యవేక్షకుల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకొచ్చే అవకాశం లేదు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్నాం. ప్లీనరీలోనే పాదయాత్రతో పాటు పార్టీ రాజకీయ వ్యూహ నిర్ణయాలను ప్రకటిస్తాం” అని జగన్ పేర్కొన్నారు.
జగన్ వ్యక్తిగత కార్యదర్శి, సాక్షి ఎడిటర్ నివాసాల్లో సిట్ సోదాలు

విజయవాడ
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ సెక్రెటరీ నాగేశ్వర రెడ్డి, సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు జరిపింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు జరిగిన సోదాలు చేసింది. మరో్వైపు. లిక్కర్ స్కాం కేసు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
బుధవారం నాడు లిక్కర్ స్కాం కేసులో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప ల బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. బెయిల్ డిస్మిస్ చేయడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
రూ.5 లక్షలు కట్టాలని కే ఏ పాల్ కు హైకోర్టు సూచన

విజయవాడ
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు విచారించింది. ఆ కేసును సిబిఐ తో విచారణ జరిపించాలని పిల్ లో పాల్ కోరారు. ఆ వ్యాజ్యాన్ని ఆయన సదుద్దేశంతోనే దాఖలు చేశారన్న రుజువు కోసం కోర్టు రిజిస్ట్రీ వద్ద రూ. 5లక్షలు కట్టాలని సూచించింది. ఆ సొమ్ము చెల్లించిన తర్వాతే విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
