సంక్షిప్త వార్తలు:05-08-2025:బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సందడి చేశారు. కర్రెరా కళ్ల జోళ్ల పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఆయన ఆ సంస్థ సరికొత్త ఉత్పత్తులను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ కర్రెరాతో భాగస్వామ్యం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కర్రెరా సరికొత్త ఉత్పత్తులను ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.
తాజ్ కృష్ణలో ప్యాట్ కమిన్స్ సందడి
హైదరాబాద్
బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సందడి చేశారు. కర్రెరా కళ్ల జోళ్ల పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఆయన ఆ సంస్థ సరికొత్త ఉత్పత్తులను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ కర్రెరాతో భాగస్వామ్యం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కర్రెరా సరికొత్త ఉత్పత్తులను ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.
విభిన్న స్టైల్స్, విభిన్న డిజైన్స్లో అందరినీ ఆకట్టుకనేలా కళ్లజోళ్లు, గాగుల్స్ను కర్రెరా తీసుకువస్తుందన్నారు. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అల్బెర్టో మక్కియని మాట్లాడతూ ఇండియాలో 2025 మే నుంచి మూడు ఆప్టికల్ ఫ్రేమ్స్ ను, మూడు కొత్త సన్ గ్లాస్లను పరిచయం చేయడం జరిగిందన్నారు.
ఎల్ జి ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ

అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్ జి ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మేం ఈరోజు ఎల్ జి యూనిట్ కు మాత్రమే కాదు – ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ జి ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్,
భారత్ లో కొరియన్ రిపబ్లిక్ రాయబారి లీ సియాంగ్ హో, ఎల్ జి ఎలక్ట్రానిక్స్ హోం సొల్యూషన్స్ సిఈఓ జేచియోల్ లియు, ఎకో సొల్యూషన్స్ సిఈఓ జే సంగ్ లీ, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ జి. శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏపీఐఐసి వైస్ చైర్మన్ అభిషిక్త్ కిషోర్, కాన్సులేట్ జనరల్ (ఏపీ, తెలంగాణా) చుక్కపల్లి సురేష్ పాల్గొన్నారు.
సత్యవేడులో మంత్రి నారా లోకేష్ 62వ రోజు ప్రజాదర్బార్

సత్యవేడు
కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్యుల సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా పనిచేస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన తిరుపతి జిల్లా సత్యవేడు పర్యటనలో రెండో రోజు ఉదయం స్థానిక సంత ప్రాంగణంలో 62వ ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారినుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్ రాకను పురస్కరించుకుని పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.
